Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అక్కడే మారిపోయా.. మా నాన్న మరణం తర్వాత రవి సర్ మద్దతు మరవలేనిది: సిరాజ్

Mohammed Siraj reveals how head Coach Ravi Shastri backed him after father’s demise

ముంబై: ఆస్ట్రేలియా పర్యటన తర్వాత తన వైఖరి పూర్తిగా మారిపోయిందని, తన ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిందని టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ అన్నాడు. ఆ పర్యటనలో హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇచ్చిన మద్దతు మరవలేనిదని ఈ హైదరాబాద్ పేసర్ చెప్పుకొచ్చాడు. జట్టులో అద్భుతమైన పేసర్లు ఉన్నారని.. అత్యంత ఆరోగ్యకరమైన పోటీ ఉందని పేర్కొన్నాడు.

సీనియర్లు తనకు విలువైన సలహాలు ఇస్తున్నారని వెల్లడించాడు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో చోటు దక్కుతుందో లేదో తెలియదని, కానీ మెరుగ్గా రాణించేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపాడు. తాజాగా ఏబీపీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిరాజ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

రవి సర్ ఎంకరేజ్ చేశాడు..

రవి సర్ ఎంకరేజ్ చేశాడు..

'ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా మా నాన్నను కోల్పోయిన నాకు రవిసర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ సర్ అండగా నిలిచారు. రవి సర్ నా దగ్గరకు వచ్చి 'మీ నాన్న ఆశీస్సులు నీకుంటాయి. నీవు టెస్ట్ మ్యాచ్ ఆడటమే కాకుండా ఐదు వికెట్లు తీస్తావ్'అని చెప్పాడు. బ్రిస్బెన్ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన తర్వాత రవి సర్ నాతో ఇదే అన్నాడు. 'ఐదు వికెట్లు తీస్తావని ముందే చెప్పానుగా'అని గుర్తు చేశాడు. ఇలా ఇద్దరు కోచ్‌లు ప్రోత్సహించడంతో నా ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోయింది.'అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.

కోహ్లీ భయ్యాకు రుణపడి ఉంటా..

కోహ్లీ భయ్యాకు రుణపడి ఉంటా..

ఇక విరాట్ కోహ్లీ భయ్యా ఇచ్చిన మద్దతు గురించి ఎంత చెప్పినా తక్కువేనని, అతనికి తాను జీవితాంతం రుణపడి ఉంటానన్నాడు. 'విరాట్ భాయ్ ఎప్పుడూ అండగా నిలిచాడు. ఐపీఎల్‌లో గత రెండు సీజన్లు రాణించకున్నా.. నాకు మరో అవకాశం ఇస్తూ ఆర్‌సీబీ తరఫున రిటైన్ చేసుకున్నాడు. నా సామర్థ్యం, బౌలింగ్‌పై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ నన్ను ప్రోత్సహించాడు. నా సక్సెస్ ప్రతీ అడుగులో అతని పాత్ర ఉంది. నీకు సామర్థ్యం ఉంది.. ఏ వికెట్‌పై అయినా ఆడగల సత్తా ఉంది. ఎలాంటి బ్యాట్స్‌మెన్ అయినా పెవిలియన్‌ పంపించగలవని విరాట్‌ భయ్యా ఎప్పుడూ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటాడు.'అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.

అదే నా బెస్ట్ మూమెంట్..

అదే నా బెస్ట్ మూమెంట్..

'ఆస్ట్రేలియా పర్యటన నా కెరీర్‌లోనే అత్యుత్తమ సందర్భం. అది నన్నెంతో మార్చింది. బౌలింగ్ పట్ల పూర్తిగా నా వైఖరిని మార్చేసింది. ప్రస్తుత భారత జట్టులో భాగమవ్వడం గొప్ప అనుభూతి. స్వదేశమైనా విదేశమైనా.. ఎక్కడైన టీమ్ మిండియా ఎవరినైనా ఓడించగలదు. ఇలాంటి పటిష్టమైన జట్టులో చోటుకోసం పోటీ ఉండటం వ్యక్తిగతంగా నేను ఆస్వాదిస్తున్నా. సీనియర్లంతా చాలా మంచివారు. విలువైన సలహాలు ఇస్తుంటారు. పేస్ బౌలింగ్ కళ నేర్చుకొనేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో చోటు దొరుకుతుందో లేదో నిజంగా నాకు తెలియదు. మెరుగ్గా బౌలింగ్ చేసేందుకు అవకాశం దొరికితే ఆడేందుకు సిద్దంగా ఉన్నాను'అని సిరాజ్ తెలిపాడు.

ఇంగ్లండ్‌కు పయనం..

ఇంగ్లండ్‌కు పయనం..

న్యూజిలాండ్‌తో వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్, ఆపై ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌... సుమారు మూడున్నర నెలల పాటు సాగే ఈ పర్యటన కోసం భారత క్రికెట్‌ జట్టు బుధవారం అర్థరాత్రి ప్రత్యేక విమానంలో బయలుదేరింది. జూన్ 18 నుంచి 23 వరకు సౌతాంప్టన్ వేదికగా ఈ మెగా ఫైనల్ జరగనుండగా.. ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14వరకు ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఇక ఇంగ్లండ్ పిచ్‌లు సిరాజ్ కలిసిరానున్నాయి. ఈ క్రమంలో అతనికి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా ఐపీఎల్‌లో అతను మెరుగ్గా బౌలింగ్ చేశాడు.

Story first published: Thursday, June 3, 2021, 16:44 [IST]
Other articles published on Jun 3, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+