Mohammed Siraj: రాస్ టేలర్ వికెట్.. ఏ బౌలర్‌కైనా డ్రీమ్ బాల్! ఆ బంతులు వేస్తే వదిలేస్తారు!

ముంబై: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ దుమ్మురేపాడు. సూపర్బ్ బౌలింగ్‌తో కివీస్ పతనాన్ని శాసించాడు. ఒకే ఓవర్‌లో ఓపెనర్లిద్దరిని ఔట్ చేసిన మియా భాయ్... ఆ తర్వాత స్వింగ్ డెలవరీతో కివీస్ సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ వికెట్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
అయితే ఈ వికెట్ తీసిన తీసిన డెలివరీ.. ఏ బౌలర్‌కైనా డ్రీమ్ బాల్ అని మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ మహమ్మద్ సిరాజ్ అన్నాడు. ఆ బాల్‌ను ప్రణాళికల ప్రకారం ఎక్స్‌క్యూషన్ చేశానన్నాడు. ఆదిలోనే సిరాజ్ మూడు కీలక వికెట్లు తీయడం.. ఆ తర్వాత స్పిన్ త్రయం చెలరేగడంతో న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 62 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే.

పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేశా..
గాయంతో ఫస్ట్ టెస్ట్‌కు దూరమైన సిరాజ్.. రెండో టెస్ట్‌తో రీ ఎంట్రీ ఇచ్చాడు. పేసర్లకు ఏ మాత్రం అనుకూలంగా లేని పిచ్‌పై తన స్వింగ్‌తో అదరగొట్టాడు. తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేసిన సిరాజ్.. గాయం నుంచి కోలుకున్న తర్వాత సింగిల్ వికెట్ మీద బాగా ప్రాక్టీస్ చేశానన్నాడు. 'ఇన్‌స్వింగ్ డెలివరీ కోసం మేం ఫీల్డ్‌ను సెట్ చేశాం. బాల్‌ను ప్యాడ్స్‌కు తాకేలా వేయాలని ప్లాన్ చేశాం. కానీ నా రిథమ్‌ను అందుకున్నాక, జౌట్ స్వింగ్ ఎందుకు వేయకూడదని ఆలోచించా. దానిని పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేశా. ఏ ఫాస్ట్ బౌలర్‌కైనా అది డ్రీమ్ డెలివరీ'అని సిరాజ్ పేర్కొన్నాడు.

ఔట్‌సైడ్ బంతులు వేస్తే..
ఇంజ్యూరీ నుంచి కోలుకున్న తర్వాత.. తాను ఎక్కువగా సింగిల్ వికెట్ మీద ప్రాక్టీస్ చేశానన్నాడు. దాని వల్ల ఎక్కువ స్వింగ్ రాబట్టే చాన్స్ దొరికిందన్నాడు. దానిపైనే ఎక్కువగా ఫోకస్ చేశానని సిరాజ్ వెల్లడించాడు. 'నాకు టెస్ట్ మ్యాచ్‌లో ఆడే చాన్స్ వచ్చినప్పుడు ఒకే ఏరియాలో నిలకడగా బంతులు వేయాలని భావించా.
నా రిథమ్ పర్ఫెక్ట్‌గా కుదరడానికి అది ఉపయోగపడింది. అదే టైమ్‌లో బ్యాటర్‌కు ఇబ్బందులు కూడా తెచ్చి పెట్టింది. మనం ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ వేస్తే బ్యాట్స్‌మన్ ఎక్కువగా వదిలేస్తాడు. కాబట్టి మిడిల్ వికెట్‌ను బేస్ చేసుకుని బాల్‌ను ఇరువైపులా స్వింగ్ చేస్తే కచ్చితంగా ఎక్కడో ఓ చోట దొరికిపోతాడు'అని ఈ హైదరాబాద్ పేసర్ చెప్పుకొచ్చాడు.

సిరాజ్ ఉచ్చులో..
ముందుగా విల్ యంగ్‌కు స్లిప్‌లో ఉచ్చు బిగించిన హైదరాబాద్ పేసర్.. వరుసగా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్, షార్ట్ పిచ్ బాల్స్ వేసి ఒక్కసారిగా ఇన్‌స్వింగ్ డెలవరీ వేసాడు. దాంతో బంతిని ఆడక తప్పని పరిస్థితి ఏర్పడటంతో యంగ్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ నాగుపాములా దూసుకొచ్చిన బంతి బ్యాట్‌ను ముద్దాడుతూ.. సెకండ్ స్లిప్ దిశగా దూసుకెళ్లింది. లో క్యాచ్‌గా వచ్చిన బంతిని కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా అందుకున్నాడు. ఇక అదే ఓవర్‌లో టామ్ లాథమ్ బౌండరీ బాదగా.. అతనికి తగ్గట్లు సిరాజ్ మంచి ప్లాన్ రచించాడు.
డీప్ స్క్వేర్ లెగ్‌లో ఫీల్డర్ పెట్టి షార్ట్ పిచ్ బాల్స్‌తో ఊరించాడు. దాంతో టెంప్ట్ అయిన లాథమ్ హుక్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచి నేరుగా డీప్ స్క్వేర్ లెగ్ ఫీల్డర్ శ్రేయస్ అయ్యర్ చేతిలో పడింది. సిరాజ్ ప్లాన్‌ను గ్రహించలేకపోయిన లాథమ్.. అతని ఉచ్చులో పడ్డాడు. ఇక తన మరుసటి ఓవర్‌లో తొలి బంతికి రాస్ టేలర్ బౌల్డ్ అయ్యాడు. సిరాజ్ వేసిన స్వింగ్ బాల్‌కు టేలర్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని ఆఫ్ స్టంప్‌ను ఎగరగొట్టింది.

332 పరుగుల ఆధిక్యంలో..
ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపు ఇక లాంఛనమే కావచ్చు. శనివారం కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 28.1 ఓవర్లలో 62 పరుగులకే కుప్పకూలింది. జేమీసన్ (17)దే అత్యధిక స్కోరు. దాంతో భారత్‌కు 263 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేయడంతో ఓవరాల్ ఆధిక్యం 332 పరుగులకు చేరింది.
ఫీల్డింగ్‌లో గాయపడిన శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయకపోగా... మయాంక్ అగర్వాల్ (38 బ్యాటింగ్), చతేశ్వర్ పుజారా (29 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఉదయం భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 109.5 ఓవర్లలో 325 పరుగులు చేసి ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (311 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్స్‌లతో 150) మరికొన్ని పరుగులు జోడించగా, అక్షర్ పటేల్ (128 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 52) అర్ధసెంచరీ సాధించాడు. కివీస్ స్పిన్నర్ ఎజాజ్ పటేల్ 10 వికెట్లు పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications