నా బౌలింగ్ చూసి మా మామ షాకయ్యాడు.. ఆ తొమ్మిది వికెట్లు నా జీవితాన్ని మార్చేసాయి: సిరాజ్

న్యూఢిల్లీ: తాను క్రికెటర్‌గా ఎదగడంలో తన మామ కీలక పాత్ర పోషించాడని టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ తెలిపాడు. రెక్కాడితే గానీ డొక్కాడని తమ కుటుంబాన్ని ఆయనే ఒప్పించాడని, తన సొంత క్లబ్ తరఫున క్రికెట్ ఆడే అవకాశం కల్పించాడని సిరాజ్ గుర్తు చేసుకున్నాడు. 2017లో భారత తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సిరాజ్.. ఆరంభంలో కొంత తడబాటుకు గురయ్యాడు. కానీ గతేడాది నుంచి జట్టులో కీలక పేసర్‌గా ఎదిగాడు. ఆస్ట్రేలియా పర్యటన అనంతరం కొత్త సిరాజ్‌ను తలపిస్తున్నాడు. ఈ క్రమంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అతన్ని రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2022 సీజన్ నేపథ్యంలో క్యాంపైన్ షురూ చేసిన ఆర్‌సీబీ తమ ఆటగాళ్లతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

మా తల్లిదండ్రులు గొడవపడేవారు..
ఈ నేపథ్యంలో సిరాజ్ ఆర్‌సీబీ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'నా కెరీర్ విషయమై అమ్మ, నాన్న ఎప్పుడు గొడవపడుతుండేవారు. నేను జాబ్ చేయాలా? లేక చదువుకోవాలా ?అనే దానిపై రోజు పెద్ద చర్చ నడిచేది. కానీ నా ధ్యాసంతా క్రికెట్‌పైనే ఉండేది. చదవడం, ఉద్యోగం చేయడం అస్సలు ఇష్టం లేదు. ఈ విషయం అమ్మా నాన్నకు ఎలా చెప్పాలో అర్థం కాకపోయేది. ఆ సమయంలో మా మామ నాకు సహకరించాడు. ఒకరోజు గొడవ జరుగుతున్న సందర్భంలో మామ ఇంటికి వచ్చాడు.

మా మామ షాక్..
ఆయనకు ఓ క్రికెట్ క్లబ్ ఉంది. నాకెరీర్ గురించి మా వాళ్లు పడుతున్న ఆందోళన గురించి తెలుసుకున్న మామ.. 'నా క్రికెట్ క్లబ్‌కు తీసుకెళ్తాను. అక్కడికి వచ్చి సిరాజ్ క్రికెట్ ఆడతాడు.. ఆ తర్వాత ఏం చేయాలో తర్వాత డిసైడ్ చేద్దాం'అని మా తల్లిదండ్రులకు చెప్పాడు. నేను కూడా సరేనని దానికి ఒప్పుకున్నా. ఇక ఆ క్లబ్ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే నేను తొమ్మిది వికెట్లు తీశా. నా బౌలింగ్ చూసి మా మామ ఆశ్చర్యపోయాడు. ఇంత బాగా ఆడతావని ఊహించలేదని చెప్పాడు. వెంటనే మా నాన్నకు ఈ విషయాన్ని తెలియజేశాడు. వాడిని చదవమని.. జాబ్ చేయమని బలవంతం చేయవద్దు.. నచ్చింది చేయనివ్వండి. సిరాజ్‌కు అండగా నేనుంటా.. ఖర్చులన్నీ భరిస్తా అని చెప్పి.. అప్పుడే నాకు రూ.500 నోటు నా చేతిలో పెట్టాడు.

ఆ తొమ్మిది వికెట్లు..
బహుశా అదే నా తొలి సంపాదన అనుకుంటా. అందులో రూ.300 నా కుటుంబానికి ఇచ్చి.. మిగతా రెండు వందల రూపాయాలు నా దగ్గరే పెట్టుకున్నా. ఒక రకంగా నేను క్రికెట్‌లో అడుగుపెట్టడానికి మా మామ పరోక్షంగా కారణం అయితే.. ప్రత్యక్షంగా ఆ 9 వికెట్లు ఉంటాయి. నిజానికి ఆ తొమ్మిది వికెట్లు నా తలరాతను మార్చాయి.. లేకుంటే ఈరోజు ప్రపంచస్థాయి బౌలర్‌గా మీ ముందుండే వాడిని కాదు'అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. ఇక సిరాజ్ టీమిండియా తరపున 4 టెస్టులు, 2 వన్డేలు, 12 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో 50 మ్యాచ్‌ల్లో 50 వికెట్లు తీశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications