IND vs IRE: సిరాజ్ ఔట్.. భువనేశ్వర్ కుమార్‌కు మళ్లీ నిరాశే!
ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత టీ20 జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. అనూహ్యంగా ఈ సిరీస్‌ల నుంచి మహమ్మద్ సిరాజ్‌కు విశ్రాంతి కల్పించారు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. సిరాజ్ స్థానంలో ప్రసిధ్ కృష్ణను ఎంపిక చేశారు. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది.
'ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు మహమ్మద్ సిరాజ్ స్థానాన్ని ప్రసిధ్ కృష్ణతో భర్తీ చేశారు. బీసీసీఐ మెడికల్ టీమ్, టీమ్ మేనేజ్‌మెంట్‌తో చర్చల అనంతరం వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా మహమ్మద్ సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించారు.'అని బీసీసీఐ పేర్కొంది. దాంతో ఐపీఎల్ టాప్ పెర్ఫార్మర్, వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.

బీసీసీఐ ఆటగాళ్ల ప్రదర్శన కంటే వయసుకే అత్యంత ప్రాధాన్యత ఇస్తుందనే విషయం మరోసారి స్పష్టమైంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో భువనేశ్వర్ కుమార్ అద్బుత ప్రదర్శన కనబర్చాడు. 16 మ్యాచ్‌ల్లో 7.95 ఎకానమీతో 28 వికెట్లు తీసి ఆర్‌సీబీ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. మరే భారత పేసర్ కూడా భువనేశ్వర్ కుమార్‌లా రాణించలేదు.
అయినా సెలెక్టర్లు భువనేశ్వర్‌ను పట్టించుకోవడం లేదు. ఐపీఎల్ 2026 ప్రదర్శనతోనే భువనేశ్వర్ కుమార్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాడని అంతా అనుకున్నారు. కానీ సెలెక్టర్లు అతని పేరును కూడా పరిగణలోకి తీసుకోలేదు.
జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్‌తో రెండు టీ20లు ఆడనున్న టీమిండియా.. జులై 1 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ రెండు సిరీస్‌ల్లో టీమిండియాను శ్రేయస్ అయ్యర్ నడిపించనున్నాడు. ఈ సిరీస్‌లతో భారత టీ20 క్రికెట్‌లో కొత్త అధ్యాయం మొదలవ్వనుంది. టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కూడా ఈ సిరీస్‌లకు ఎంపికయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కూడా కోల్పోయాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులోని ఐదుగురు ఆటగాళ్లు ఈ సిరీస్‌లకు ఉద్వాసనకు గురయ్యారు.
ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు భారత జట్టు:
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), ఇషాన్ కిషన్(కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిధ్ కృష్ణ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

