Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

BCCI Central Contracts: సిరాజ్‌కు ప్రమోషన్.. పాండ్యా, రహానే, పుజారాకు డిమోషన్!

 Mohammed Siraj Promoted and Ajinkya Rahane, Cheteshwar Pujara demoted in latest BCCI central contracts

మొహాలీ: టెస్ట్‌లతో పాటు పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లోనూ సత్తా చాటుతున్న టీమిండియా పేసర్, హైదరాబాద్బౌలర్ మహమ్మద్ సిరాజ్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రమోషన్ ఇచ్చింది. ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టుల్లో సిరాజ్‌ను సి నుంచి బీ గ్రేడ్‌కు చేర్చింది. ఇక ఎంత సీనియర్లయినా ఫామ్‌ కోల్పోతే ఉపేక్షించేది లేదని ఇటీవల జట్టు ఎంపికలోనే సంకేతాలు ఇచ్చిన బీసీసీఐ.. ఇప్పుడు కాంట్రాక్టుల విషయంలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. నిలకడ లేమితో శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు జట్టులో చోటు కోల్పోయిన సీనియర్‌ ఆటగాళ్లు చతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానే, ఇషాంత్‌ శర్మలను సెంట్రల్ కాంట్రాక్టులో 'ఎ' నుంచి 'బి' విభాగానికి డిమోట్ చేసింది. ఈ మేరకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులకు బోర్డు అపెక్స్ కౌన్సిల్ బుధవారం ఆమోదం తెలిపింది.

ఏ కేటగిరిలో ఐదుగురే..

ఏ కేటగిరిలో ఐదుగురే..

గతేడాది 'ఎ'లో ఉన్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఏకంగా 'సి'కి పడిపోయారు. గతేడాది 'ఎ'లో పదిమంది చోటు దక్కించుకోగా.. ఈసారి కేఎల్ రాహుల్ రాహుల్, మహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్‌లతో ఐదుగురు మాత్రమే అందులో కొనసాగుతున్నారు. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ వృద్ధిమాన్‌ సాహాకు 'సి' కాంట్రాక్టు ఇచ్చారు. నిలకడగా రాణించలేకపోతున్న మయాంక్‌ అగర్వాల్‌ 'బి' నుంచి 'సి'కి డిమోట్ అయ్యాడు.

అమ్మాయిల కాంట్రాక్టులు..

అమ్మాయిల కాంట్రాక్టులు..

రూ.7 కోట్ల వార్షిక వేతనం పొందే 'ఎ+' విభాగంలో విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా కొనసాగుతున్నారు. మహిళా క్రికెటర్ల కాంట్రాక్టులను సైతం బీసీసీఐ ఖరారు చేసింది. ఇప్పటికే హర్మన్‌ప్రీత్‌, స్మృతి మంధాన, పూనమ్‌ యాదవ్‌ ఉన్న గ్రూప్‌ 'ఎ'లోకి కొత్తగా దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్‌లను చేర్చారు. వీరికి వార్షిక వేతనం రూ.50 లక్షలు. రూ.30 లక్షలు 'బి' విభాగంలో మిథాలి రాజ్‌, జులన్‌ గోస్వామి కొనసాగుతున్నారు. జెమీమా రోడ్రిగ్స్‌ 'బి' నుంచి 'సి' (రూ.10 లక్షలు)కి డిమోట్ అయింది.

బీసీసీఐ 2022-23 కాంట్రాక్టులు..

బీసీసీఐ 2022-23 కాంట్రాక్టులు..

ఎ+ (ఏడాదికి రూ.7 కోట్లు): విరాట్ కోహ్లీ, రోహిత్‌ ,బుమ్రా

ఎ (రూ.5 కోట్లు): అశ్విన్‌, జడేజా, పంత్‌, కేఎల్‌ రాహుల్‌, షమి

బి (రూ.3 కోట్లు): పుజారా, రహానె, ఇషాంత్‌, శ్రేయస్‌, అక్షర్‌ పటేల్‌, సిరాజ్‌, శార్దూల్‌

సి (రూ.1 కోటి): ధావన్‌, హార్దిక్‌ పాండ్య, సాహా, వాషింగ్టన్‌ సుందర్‌, దీపక్‌ చాహర్‌, చాహల్‌, శుభ్‌మన్‌ గిల్‌, విహారి, మయాంక్‌, సూర్యకుమార్‌, ఉమేశ్‌, భువనేశ్వర్‌.

IPL 2022 : 25% Spectators Will Be Allowed In Stadiums For IPL 2022 | Oneindia Telugu
వైజాగ్‌లో టీ20..

వైజాగ్‌లో టీ20..

సొంతగడ్డపై సౌతాఫ్రికాతో ఆడనున్న టీ20 సిరీస్‌ల వేదికలను బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఖారు చేసింది. ఐపీఎల్‌ తర్వాత జూన్‌లో ఈ సిరీస్ జరగనుంది. ఈ మ్యాచ్‌లు వరుసగా కటక్‌, విశాఖపట్నం, ఢిల్లీ, రాజ్‌కోట్‌, చెన్నైల్లో జరుగుతాయి. మ్యాచ్‌ల తేదీలు ఖరారు కావాల్సి ఉంది. చాలా రోజుల తర్వాత వైజాగ్ వేదికగా మ్యాచ్ జరగనుంది.

Story first published: Thursday, March 3, 2022, 9:50 [IST]
Other articles published on Mar 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+