Mohammed Siraj: వారెవ్వా వాటే బౌలింగ్! మియా భాయ్ ఉచ్చులో కివీస్ బ్యాట్స్‌మన్ విల విల!

ముంబై: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ దుమ్మురేపాడు. ఒకే ఓవర్‌లో ఓపెనర్లు టామ్ లాథమ్(10), విల్ యంగ్(4)ను పెవిలియన్ చేర్చిన హైదరాబాద్ పేసర్.. ఆ తర్వాత కివీస్ సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్‌ను క్లీన్ బౌల్డ్ చేసి ఆ జట్టుకు గట్టి షాకిచ్చాడు. ముందుగా విల్ యంగ్‌ను స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చిన సిరాజ్.. ఆ తర్వాత టామ్ లాథమ్‌ను షార్ట్ పిచ్ బాల్‌తో బొల్తా కొట్టించాడు. తన మరుసటి ఓవర్‌లో సూపర్ ఇన్ స్వింగ్ డెలవరీతో టేలర్ ఆఫ్ స్టంప్ ఎగరగొట్టాడు. దాంతో 17 పరుగులకే కివీస్ మూడు వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఈ మూడు వికెట్లను సిరాజ్ ప్రణాళిక బద్దంగా బౌలింగ్ చేసి సాధించాడు.

సిరాజ్ ఉచ్చులో..
ముందుగా విల్ యంగ్‌కు స్లిప్‌లో ఉచ్చు బిగించిన హైదరాబాద్ పేసర్.. వరుసగా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్, షార్ట్ పిచ్ బాల్స్ వేసి ఒక్కసారిగా ఇన్‌స్వింగ్ డెలవరీ వేసాడు. దాంతో బంతిని ఆడక తప్పని పరిస్థితి ఏర్పడటంతో యంగ్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ నాగుపాములా దూసుకొచ్చిన బంతి బ్యాట్‌ను ముద్దాడుతూ.. సెకండ్ స్లిప్ దిశగా దూసుకెళ్లింది. లో క్యాచ్‌గా వచ్చిన బంతిని కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా అందుకున్నాడు. ఇక అదే ఓవర్‌లో టామ్ లాథమ్ బౌండరీ బాదగా.. అతనికి తగ్గట్లు సిరాజ్ మంచి ప్లాన్ రచించాడు.

ఊరించే బంతితో..
డీప్ స్క్వేర్ లెగ్‌లో ఫీల్డర్ పెట్టి షార్ట్ పిచ్ బాల్స్‌తో ఊరించాడు. దాంతో టెంప్ట్ అయిన లాథమ్ హుక్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచి నేరుగా డీప్ స్క్వేర్ లెగ్ ఫీల్డర్ శ్రేయస్ అయ్యర్ చేతిలో పడింది. సిరాజ్ ప్లాన్‌ను గ్రహించలేకపోయిన లాథమ్.. అతని ఉచ్చులో పడ్డాడు. ఇక తన మరుసటి ఓవర్‌లో తొలి బంతికి రాస్ టేలర్ బౌల్డ్ అయ్యాడు. సిరాజ్ వేసిన ఇన్ స్వింగర్ టేలర్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని ఆఫ్ స్టంప్‌ను ఎగరగొట్టింది. దాంతో టేలర్ నిరాశగా పెవిలియన్ చేరాడు.

భారత్ 325 ఆలౌట్..
221/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్(311 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్స్‌లతో 150) భారీ శతకంతో చెలరేగగా.. చివర్లో అక్షర్ పటేల్(128 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ఆజాజ్ పటేల్ ఒక్కడే 10 వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించాడు. తద్వారా 10 వికెట్ల ఘనతను అందుకున్న మూడో బౌలర్‌గా గుర్తింపు పొందాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications