For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Mohammed Siraj: వారి నోళ్లు మూయించేందుకే ఈ తరహా సెలెబ్రేషన్స్!

Mohammed Siraj opens up about his ‘finger on lips’ celebration in Lords test

లండన్: క్రికెట్‌లో సెంచరీ చేసినప్పుడు బ్యాట్స్‌మన్, వికెట్ తీసినప్పుడు బౌలర్ సంబరాలు చేసుకుంటారు. ఒక్కో ప్లేయర్ ఒక్కో శైలిని అనుసరిస్తుంటారు. బ్యాట్స్‌మెన్‌లో చాలా మంది బ్యాట్ పైకెత్తుతూ ఆకాశం వైపు చూస్తుంటారు. కొందరు గాల్లోకి ఎగురుతూ తమ ట్రేడ్ మార్క్ సెలెబ్రేషన్స్‌తో అలరిస్తుంటారు. బౌలర్లు సైతం వికెట్ తీసిన వెంటనే గట్టిగా అరుస్తుంటారు. చిందులేస్తుంటారు. ఈ క్రమంలో వాగ్వాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సెలెబ్రేషన్స్ విషయంలో విండీస్ ప్లేయర్లు యునిక్ స్టైల్‌ను అనుసరిస్తుంటారు. డ్యాన్స్, సెల్యూట్, నోట్ బుక్ స్టైల్ సంబరాలతో అభిమానులను అలరిస్తుంటారు.

నోటిపై వేలు వేస్తూ..

నోటిపై వేలు వేస్తూ..

ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ సైతం ఓ కొత్త తరహా సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో దుమ్మురేపుతున్న ఈ హైదరాబాద్ గల్లీ బాయ్.. వికెట్​ తీసిన ప్రతిసారి.. బ్యాట్స్​మన్​వైపు చూస్తూ మౌనంగా వెళ్లిపోమ్మని.. పెదవులపై వేలు పెట్టుకుని సైగలు చేస్తున్నాడు. అయితే ఈ సెలెబ్రేషన్స్‌పై విమర్శలు వచ్చాయి. దీనిని పలువురు మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు. అంత అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇది సిరాజ్ స్థాయికి తగదంటున్నారు.

విమర్శకుల కోసమే..

విమర్శకుల కోసమే..

ఇదే విషయాన్ని సిరాజ్ ముందు ప్రస్తావించగా.. తన సెలెబ్రేషన్స్ వెనుక ఉన్న కారణాన్ని అతను తెలియజేశాడు. మూడో రోజు ఆట అనంతరం మీడియాతో మాట్లాడిన సిరాజ్.. విమర్శకుల నోళ్లు మూయించేందుకు ఈ కొత్త తరహా సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. 'నేను అలా వేడుక చేసుకోవడానికి కారణం నా విమర్శకులు. నేను ఏదీ చేయలేనని, నా గురించి చాలా చెబుతుంటారు. నన్ను ద్వేషించేవారికి నా బంతితోనే సమాధానం చెబుతా. అందుకే ఈ కొత్త తరహా ట్రేడ్ మార్క్ సెలెబ్రేషన్ చేసుకుంటున్నా.' అని మహ్మద్​ సిరాజ్ చెప్పుకొచ్చాడు.

లార్డ్స్​ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో సిరాజ్​ 4 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

సిరాజ్ ప్రవర్తనపై

సిరాజ్ ప్రవర్తనపై

ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో సిరాజ్ ప్రవర్తన‌పై కూడా విమర్శలు వచ్చాయి. అండర్సన్, సామ్ కరన్‌‌లపై అతను స్లెడ్జింగ్‌కు దిగడాన్ని మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు. అంతేకాకుండా అత్యుత్సాహంతో భారత రివ్యూలను వృథా చేయడంపై కూడా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆట పరంగా సిరాజ్ రాణిస్తున్నప్పటికీ ఇతర క్రికెటర్లు కనీస మర్యాద ఇవ్వాలంటున్నారు. ప్రాక్టీస్ సందర్భంగా వాషింగ్టన్‌ సుందర్‌ను గాయపరిచిన అతను.. ఆ తర్వాత నెట్స్‌లో రాకాసి బౌన్సర్‌తో మయాంక్‌ను జట్టుకు దూరం చేశాడు. ఈ క్రమంలోనే సిరాజ్ అంటే అభిమానులు ఫైర్ అవుతున్నారు.

వెనుకంజలో భారత్..

వెనుకంజలో భారత్..

ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు 27 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్‌ దక్కింది. ఓవర్‌నైట్‌ స్కోరు 119/3తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ జో రూట్‌ (321 బంతుల్లో 18 ఫోర్లతో 180 నాటౌట్‌) వరుసగా రెండో టెస్టులోనూ సెంచరీ సాధించగా... జానీ బెయిర్‌స్టో (107 బంతుల్లో 7 ఫోర్లతో 57 ) రాణించాడు. సిరాజ్‌కు 4, ఇషాంత్‌కు 3 వికెట్లు దక్కాయి. మూడో రోజు ఆట చివరి ఓవర్‌ చివరి బంతికి అండర్సన్‌ను షమీ బౌల్డ్‌ చేయడంతో ఇంగ్లండ్‌ ఆట ముగిసింది.

అయితే ఇంగ్లండ్‌ను మరింత భారీ స్కోరు చేయకుండా అడ్డుకోగలగడమే మూడో రోజు ఆటలో భారత్‌కు ఊరటనిచ్చే అంశం. తొలి రెండు సెషన్లలో ఇంగ్లండ్‌ జోరు చూపించినా... చివరి సెషన్లో చెలరేగిన భారత బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయగలిగారు. సహచరుల నుంచి చెప్పుకోదగ్గ సహకారం లభించకపోయినా కెప్టెన్‌ జో రూట్‌ అద్భుత బ్యాటింగ్‌తో నిలవడం శనివారం ఆటలో హైలైట్‌ కాగా... టీమిండియా తరఫున సిరాజ్, ఇషాంత్‌ తమ ముద్ర చూపించారు.

Story first published: Sunday, August 15, 2021, 14:10 [IST]
Other articles published on Aug 15, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+