నెట్టింట వైరల్..
నాన్ స్ట్రయిక్‌లో ఉన్న సిరాజ్ పరుగును లెక్క చేయకుండా అంపైర్ గెరార్డ్ అబుద్‌తో కలిసి స్పందించిన తీరు క్రీడాస్పూర్తికి నిదర్శనమని ఏబీసీ. నెట్, ఏయూ క్రికెట్. కామ్ ఏయూ కితాబిచ్చాయి. సిరాజ్ క్రీడాస్పూర్తి నెట్టింట్లో కూడా వైరల్ అయింది. ఈ వీడియో కోసం కీబోర్డు వారియర్లు తెగ సెర్చ్ చేశారు. ‘సిరాజ్ బ్రిలియంట్. రన్ గురించి లెక్క చేయకుండా బ్యాట్ పడేసి వెళ్లి గ్రీన్‌ను చెక్ చేశాడు. గొప్ప క్రీడా స్పూర్తి'అని ట్వీట్లు చేశారు.

ఆసీస్ ఆల్‌రౌండర్‌కు గాయం..
గులాబీ సన్నాహక మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ సందర్భంగా ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ తీవ్రంగా గాయపడ్డాడు. భారత బ్యాట్స్‌మన్ జస్‌ప్రీత్ బుమ్రా కొట్టినా షాట్ నేరుగా గ్రీన్ ముఖానికి తగిలింది. దాంతో గ్రీన్ కుప్పకూలగా.. నాన్‌స్ట్రైకర్‌గా ఉన్న సిరాజ్ పరుగు పూర్తి చేయకుండా నేరుగా గ్రీన్ దగ్గరకు వెళ్లి గాయాన్ని పరిశీలించాడు. పరుగు కన్నా అతని గాయానికే ప్రాధాన్యత ఇచ్చి క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ
#SpiritofCricket అనే యాష్ ట్యాగ్‌తో ట్విటర్ వేదికగా పంచుకోగా వైరల్ అయింది.

విహారి క్లాస్.. పంత్ మాస్
ఈ మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తడబడిన భారత బ్యాట్స్‌మెన్ వెంటనే తమ ఆటను చక్కదిద్దుకున్నారు. మ్యాచ్ రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి (194 బంతుల్లో 104 బ్యాటింగ్; 13 ఫోర్లు), రిషభ్ పంత్ (73 బంతుల్లో 103 బ్యాటింగ్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీలతో కదం తొక్కారు. శుబ్‌మన్ గిల్ (78 బంతుల్లో 65; 10 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ (120 బంతుల్లో 61; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. తొలి ఇన్నింగ్స్‌లోని 86 పరుగులు కలిపి భారత్ ఓవరాల్ ఆధిక్యం 472 పరుగులకు చేరింది.


Click it and Unblock the Notifications












