ఐపీఎల్‌లో విఫలమయ్యానని తక్కువ అంచనా వేయవద్దు.. నా సత్తా ఏంటో చూపిస్తా: మహమ్మద్ సిరాజ్

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో విఫలమయ్యానని తనను తక్కువ అంచనా వేయవద్దని టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ అన్నాడు. అప్‌కమింగ్ ఇంగ్లండ్ పర్యటనలో తన సత్తా ఏంటో చూపిస్తానని తెలిపాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి ప్రాతినిథ్యం వహించిన సిరాజ్ దారుణంగా విఫలమయ్యాడు.
15 మ్యాచులాడి 10.07 ఎకానమీ తో 9 వికెట్లు మాత్రమే తీసాడు. ఈ ఏడాది అత్యధిక సిక్సర్లు (31) ఇచ్చుకున్న బౌలర్‌గా తన పేరిట చెత్త రికార్డును కూడా లిఖించుకున్నాడు. ఈ పేలవ ప్రదర్శనతో టీమిండియా పరిమిత ఓవర్ల జట్టులో కూడా చోటు కోల్పోయాడు.

ఇంగ్లండ్ పర్యటనకు..
అయితే ఇంగ్లండ్ వేదికగా జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు మాత్రం ఎంపికయ్యాడు. గతేడాది కరోనా కారణంగా అర్థాంతరంగా ఆగిపోయిన భారత్ - ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లోని చివరి టెస్ట్‌ను మళ్లీ నిర్వహించనున్నాడు. ఆ మ్యాచ్ కోసం ఇటీవలే భారత సెలెక్టర్లు జట్టును ఎంపిక చేయగా.. సిరాజ్‌కు అవకాశం దక్కింది. అయితే తాజాగా భారత్-ఆస్ట్రేలియాల మధ్య 2020-21లో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో తెరకెక్కిన 'బందోన్ మే ధమ్' వెబ్ సిరీస్ డాక్యుమెంటరీ ట్రైలర్ కార్యక్రమంలో సిరాజ్ పాల్గొన్నాడు.

విఫలమయ్యాను.. కానీ..
ఈ సందర్భంగా తన ఐపీఎల్ వైఫల్యంపై స్పందించిన సిరాజ్.. అప్ కమింగ్ ఇంగ్లండ్ టూర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఈ ఐపీఎల్ సీజన్‌లో నేను సరిగా ఆడలేకపోయాను. గత రెండు సీజన్లు బాగానే ఆడినా ఈ ఏడాది మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. నేను నా స్థాయి మేర కష్టపడి వచ్చే ఏడాది బలమైన పునరాగమనం చేస్తా. నా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నా బలాలపై నాకు నమ్మకముంది.

ప్రాక్టీస్ మొదలుపెట్టా..
ఇంగ్లండ్‌లో జరుగబోయే చివరి టెస్టు కోసం సన్నాహకాల్లో పాల్గొంటున్నాను. అక్కడ టెస్టులకు డ్యూక్ బాల్ వాడతారు. నేను ప్రస్తుతం దాంతోనే ప్రాక్టీస్ చేస్తున్నాను. స్వింగ్‌కు అనుకూలించే ఇంగ్లండ్ పరిస్థితుల్లో బౌలింగ్ చేయడం తాను ఎప్పుడూ ఆస్వాదిస్తాను. ఈ సిరీస్ లో మేం ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్నాం. మాదే పైచేయిగా ఉంది కాబట్టి మాకు ఆత్మవిశ్వాసం నిండుగా ఉంది. ఆ టెస్టులో మేము రాణిస్తామనే నమ్మకం కూడా ఉంది.' అని తెలిపాడు.

గెలిచినా.. డ్రా చేసుకున్నా..
ఇక జూన్ 19న ఇంగ్లండ్ పర్యటనకు భారత ఆటగాళ్లు బయలుదేరనుండగా.. జూలై 1 నుంచి 5 వరకు తొలి టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ గెలిచినా.. డ్రా చేసుకున్నా ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఇక ఆర్‌సీబీ ఈ సీజన్‌లో మరోసారి ప్లేఆఫ్స్‌కే పరిమితమైంది. లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో దుమ్మురేపిన ఆర్‌సీబీ అదే టెంపోనూ రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో మాత్రం చూపట్టలేక చతికిలపడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications