For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'సిరాజ్‌ భాయ్..‌ ఇంత మెరుగ్గా బౌలింగ్‌ చేస్తాడని ఊహించలేదు'

Mohammed Siraj has fulfilled our late fathers dream says Mohammed Ismail
Mohammed Siraj Fulfilled His Late Father's Dream Says His Brother Ismail | Oneindia Telugu

హైదరాబాద్: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా సాధించిన చారిత్రక టెస్ట్ సిరీస్ విజయంలో అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ద్వారా అరంగేట్రం చేసిన భారత ఆటగాళ్లు ఈ గెలుపులో కీలక పాత్ర పోషించారు. తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య రహానే, బీసీసీఐ నమ్మకాన్ని నిలబెడుతూ సత్తాచాటారు. ఎన్నో అవాంతరాలు దాటి సంప్రదాయ క్రికెట్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకున్న యువ ఆటగాళ్లు అంచనాలకు మించి రాణించారు. అందులో మన హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్ కూడా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్‌.. అత్యధిక వికెట్లు (13) తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు.

రెండో టెస్టులో అరంగేట్రం:

రెండో టెస్టులో అరంగేట్రం:

మొహ్మద్ సిరాజ్ 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. దేశీవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ మెరుగ్గా రాణించిన సిరాజ్‌.. ఆసీస్‌ సిరీస్‌తో జరిగే సుదీర్ఘ సిరీస్‌కు ఎంపికయ్యాడు. టూర్‌లో ఉండగానే అతడి తండ్రి మరణించినా.. ఆయన కలను నెరవేర్చాలనే ఆశయంతో జట్టుతోనే ఉండిపోయాడు. రెండో టెస్టు ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతడు.. సీనియర్ల గైర్హాజరీలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అద్భుతంగా రాణించాడు. అత్యధిక వికెట్లు (13) తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. సిరీస్‌ విజయానంతరం నగరంలోని సిరాజ్‌ ఇంటి దగ్గర సందడి వాతావరణం కనిపించింది.

నాన్న కల నెరవేరింది:

నాన్న కల నెరవేరింది:

మొహ్మద్ సిరాజ్‌ టెస్టుల్లో భారత్ తరపున ఆడడంతో తమ నాన్న కల నెరవేరిందని అతని సోదరుడు మొహ్మద్ ఇస్మాయిల్‌ తెలిపాడు. 'సిరాజ్‌ టెస్టుల్లో భారత్‌ తరపున ఆడాలనేది మా నాన్న కల. ఆయనెప్పుడూ సిరాజ్‌ను నీలం, తెలుపు రంగు జెర్సీల్లో చూడాలని అనుకున్నారు. ఇప్పుడా కల నెరవేరింది. దాన్ని సిరాజ్‌ నిజం చేశాడు. భారత జట్టు గొప్ప విజయాన్ని అందుకుంది. ఈ గెలుపులో సిరాజ్‌ భాగస్వామ్యం ఉండడం సంతోషాన్ని కలిగిస్తోంది. సిరాజ్‌ అరంగేట్ర టెస్టు నుంచి ప్రతి రోజు అతని ఆట చూస్తునే ఉన్నాం. భారత్‌కు అతను ఆడుతున్నాడంటే ఎంతో ఉత్తేజమేసింది. తన ఎంపికకు న్యాయం చేసినందుకు ఆనందంగా ఉంది. ఇంట్లో ఎలాంటి సంబరాలు చేసుకోవడం లేదు. కానీ దేశం, ఈ నగరం సంబరాలు చేసుకుంటోంది' అని తెలిపాడు.

ఇంత మెరుగ్గా బౌలింగ్‌ చేస్తాడని ఊహించలేదు:

ఇంత మెరుగ్గా బౌలింగ్‌ చేస్తాడని ఊహించలేదు:

'సిరాజ్‌ భాయ్..‌ ఇంత మెరుగ్గా బౌలింగ్‌ చేస్తాడని ఊహించలేదు. చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు తీసుకున్నాడు. ఆస్ట్రేలియాలో భారత్‌ సిరీస్‌ నెగ్గింది. చాలా చాలా సంతోషంగా ఉంది' అని మొహ్మద్ సిరాజ్‌ స్నేహితుడు షఫీ అన్నాడు. గబ్బా టెస్ట్ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో మొత్తంగా 73 పరుగులు ఇచ్చిన సిరాజ్.. డేవిడ్‌ వార్నర్‌, మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. వీరితో పాటు జోష్ హాజల్‌వుడ్‌, మిచెల్ స్టార్క్‌ను అవుట్‌ చేసి మొత్తంగా ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

24 ఏళ్ల తర్వాత:

24 ఏళ్ల తర్వాత:

హైదరాబాద్ సొగసరి వీవీఎస్‌ లక్ష్మణ్‌ (1996) తర్వాత హైదరాబాద్‌లో పుట్టి, టెస్టు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి క్రికెటర్‌ మొహ్మద్ సిరాజే కావడం విశేషం. మధ్యలో మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్‌ ఓజా ఆడినా.. అతను భువనేశ్వర్‌లో పుట్టాడు. సిరాజ్‌ ఇప్పటివరకు భారత్ తరఫున ఒక వన్డే, మూడు టీ20లు, మూడు టెస్టులు ఆడాడు. టెస్టుల్లో 13, టీ20ల్లో 3 వికెట్లు పడగొట్టాడు.

నాకూ కరోనా వచ్చింది.. వైరస్ జోక్ కాదు: సానియా

Story first published: Wednesday, January 20, 2021, 9:49 [IST]
Other articles published on Jan 20, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+