For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Mohammed Siraj నెత్తి మీద ఒక్కటి పీకిన రోహిత్ శర్మ.. ఎందుకంటే? (వీడియో)

 Mohammed Siraj got ‘slapped’ by Rohit Sharma in first T20 against New Zealand

జైపూర్: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టీ20లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్ సందర్భంగా డగౌట్‌లో కూర్చున్న టీమిండియా టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ.. ఉన్నట్టుండి సహచర ఆటగాడైన మహమ్మద్ సిరాజ్‌ నెత్తి మీద ఒక్కటేసాడు. ఏదో లోకంలో ఉంటూ బిత్తరపోయిన సిరాజ్‌ను.. కేఎల్ రాహుల్ మందలించగా అతను స్పందించలేదు. దాంతో అతని వెనుకాలనే ఉన్న రోహిత్.. అతని నెత్తి మీద ఒక్కటేసి అలర్ట్ చేశాడు. అయితే ఇదంతా టీవీ కెమెరాల్లో చిక్కుకోవడంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ సంఘటనను అభిమానులు తమకు తోచిన విధంగా వర్ణిస్తున్నారు. రోహిత్‌పై సిరాజ్ ఏదో సెటైర్ వేసినట్టున్నాడని ఒకరంటే.. మ్యాచ్ గురించి ఏదైనా నెగటీవ్‌గా కామెంట్ చేసినందకు అలా కొట్టాడేమోనని మరికొందరూ కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. మార్టిన్‌ గప్టిల్‌ (42 బంతుల్లో 70; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), మార్క్‌ చాప్‌మన్‌ (50 బంతుల్లో 63; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ (40 బంతుల్లో 62; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ‌తో ... కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (36 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) సూపర్ నాక్‌తో మంచి భాగస్వామ్యాన్ని అందించారు. అయితే మ్యాచ్ చివర్లో సూర్యకుమార్ యాదవ్‌తో పాటు శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ పేలవరీతిలో వికెట్లు చేజార్చుకోవడంతో ఉత్కంఠగా మారింది.

భారత్ జట్టు విజయానికి ఆఖరి 6 బంతుల్లో 10 పరుగులు అవసరమవగా.. భారత్ డగౌట్‌లో కాస్త టెన్షన్ వాతావరణం కనిపించింది. ఈ దశలో డగౌట్‌లోని టీవీ వైపు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ చూస్తుండగా.. వారి పక్కనే కూర్చుని ఉన్న మహ్మద్ సిరాజ్ మాత్రం ఏదో పరధ్యానంలో కనిపించాడు.

వీరివైపు టీవీ కెమెరాలు వెళ్లగా.. సిరాజ్ పరధ్యానాన్ని గమనించిన కేఎల్ రాహుల్ నీకు ఏమైంది? అనేలా సిరాజ్‌వైపు చూడగా.. వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మ వెనుక వైపు నుంచి సిరాజ్‌కి తన చేతితో ఒకటిచ్చాడు. దాంతో.. సిరాజ్ చిన్నగా నవ్వుతూ కనిపించాడు.

Story first published: Thursday, November 18, 2021, 9:44 [IST]
Other articles published on Nov 18, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+