Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మళ్లీ నోటికి ప‌నిచెప్పిన ఆసీస్ ఫ్యాన్స్‌.. సిరాజ్‌పై మరోసారి జాత్యహంకార వ్యాఖ్యలు (వీడియో)

Mohammed Siraj again faced racial comments by a group of fans in SCG stands

సిడ్నీ: సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో కొందరు ఆస్ట్రేలియా అభిమానులు మరోసారి అతిగా ప్రవర్తించారు. రెండు, మూడో రోజు ఆట సమయంలో టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌పై జాత్యంహకార వ్యాఖ్యలు చేసిన ఆసీస్ ఫ్యాన్స్.. నాలుగో రోజు ఆటలో కూడా మరోసారి నోరు పారేసుకున్నారు. ఈసారి బౌండ‌రీ ద‌గ్గ‌ర ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్‌ను మరోసారి టార్గెట్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించారు. దీంతో టీ బ్రేక్ సమయానికి ముందు మ్యాచ్ కాసేపు ఆగింది. విషయంలోకి వెళితే...

సిరాజ్‌పై మరోసారి జాత్యహంకార వ్యాఖ్యలు

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా హైదరాబాద్ పేసర్ మహ్మద్‌ సిరాజ్‌ 86వ ఓవర్ వేశాడు. ఆ ఓవర్ చివరి రెండు బంతులకు కామెరాన్‌ గ్రీన్ ‌(84; 132 బంతుల్లో 8x4, 4x6) రెండు భారీ సిక్సులు బాదాడు. ఆపై సిరాజ్‌ బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో సిరాజ్‌ను వెనుకాల స్టాండ్స్‌లో కూర్చున్న కొంత మంది అభిమానులు ఏదో అన్నారు. దీంతో అత‌డు నేరుగా కెప్టెన్ అజింక్య ర‌హానే ద‌గ్గ‌రికి వెళ్లి జ‌రిగిన విష‌యం చెప్పాడు. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి అంపైర్ పాల్ రైఫిల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కాసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది.

రంగంలోకి దిగిన పోలీసులు

రంగంలోకి దిగిన పోలీసులు

అంపైర్ చర్యతో వెంటనే స్పందించిన మైదానం సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి స్టాండ్స్‌లో కూర్చున్న ఆరుగురు ఫ్యాన్స్‌ను బ‌య‌ట‌కు పంపించేశారు. ఈ విషయం పట్ల క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) టీమిండియాకు క్షమాపణలు చెప్పింది. శనివారం కూడా భారత పేసర్లు బుమ్రా, సిరాజ్‌పై ఓ ఆస్ట్రేలియా అభిమాని జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అది తీవ్ర దుమారం రేపింది. ఈ విషయంపై బీసీసీఐ శనివారమే మ్యాచ్‌ రిఫరీ డేవిడ్‌ బూన్‌కు ఫిర్యాదు చేసింది. మూడో రోజు ఆటలో ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తున్న బుమ్రా, సిరాజ్‌లపై స్టాండ్స్‌లో మద్యం తాగుతున్న ఓ వ్యక్తి జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడు. సిరాజ్‌ను 'కోతి' అని పిలిచాడని తెలుస్తోంది.

అప్పట్లో మంకీగేట్ ఉదంతం

అప్పట్లో మంకీగేట్ ఉదంతం

శనివారం మద్యం సేవించిన ఓ ఆసీస్‌ అభిమాని.. మొహ్మద్ సిరాజ్‌ను కోతి అని పిలిచాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 2007 సిడ్నీ టెస్టులో జరిగిన మంకీగేట్ ఉదంతాన్ని గుర్తుచేయాలనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశాడని వెల్లడించాయి. 2007-08 ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్టులో మంకీగేట్ వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. హర్భజన్‌ సింగ్‌ తనని కోతి అని పిలిచాడని ఆసీస్ ఆల్‌రౌండర్ ఆండ్రు సైమండ్స్‌ ఫిర్యాదు చేశాడు. అలాంటి వ్యాఖ్యలేమీ చేయలేదని భజ్జీ వివరణ ఇచ్చాడు. కాగా అప్పట్లో మంకీగేట్ ఉదంతం తీవ్ర చర్చనీయాంశమైంది.

సెహ్వాగ్ సీరియ‌స్

సెహ్వాగ్ సీరియ‌స్

ఆదివారం జరిగిన ఘ‌ట‌న‌పై టీమిండియా మాజీ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ చాలా సీరియ‌స్ అయ్యాడు. 'మీరు చేస్తే వెట‌కారం.. మా వాళ్లు చేస్తే మాత్రం జాత్యాహంకారం. సిడ్నీలో కొంత‌మంది ఆస్ట్రేలియా అభిమానులు తీరు మరీ దారుణంగా ఉంది. మంచి టెస్ట్ సిరీస్‌ను నాశనం చేస్తున్నారు' అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. మరికొంతమంది భారత మాజీలు కూడా జాత్యహంకార వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు.

Sydney Test: ఇంతకన్నా గొప్పగా నేను ఆడలేను.. విమర్శకులపై పుజారా ఫైర్!!

Story first published: Sunday, January 10, 2021, 12:16 [IST]
Other articles published on Jan 10, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+