Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sydney Test: ఇంతకన్నా గొప్పగా నేను ఆడలేను.. విమర్శకులపై పుజారా ఫైర్!!

Cheteshwar Pujara said Couldnt have done anything better

సిడ్నీ: తనపై వస్తున్న విమర్శలపై టీమిండియా నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా స్పందించాడు. తాను బాగానే ఆడానని, ఇంతకన్నా గొప్పగా ప్రయత్నించలేనని విమర్శకులపై ఫైర్ అయ్యాడు. ఆస్ట్రేలియా పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్న ఆ పరిస్థితుల్లో అంతకంటే గొప్పగా ఆడలేనన్నాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నిదానంగా ఆడిన పుజారాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిఫెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తూ 176 బంతుల్లో 50 పరుగులు చేశాడు. పుజారా అతి జాగ్రత్తగా ఆడటం వల్ల ఇతర బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరిగిందని, అతడు వేగంగా ఆడాల్సిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇంతకన్నా గొప్పగా నేను ప్రయత్నించలేను

ఇంతకన్నా గొప్పగా నేను ప్రయత్నించలేను

శనివారం మీడియా సమావేశంలో చెతేశ్వర్‌ పుజారా మాట్లాడాడు. 'నేను బాగానే ఆడాను. కానీ ఓ మంచి బంతికి ఔటయ్యా. దాన్ని అంగీకరించాల్సిందే. ఇంతకన్నా గొప్పగా నేను ప్రయత్నించలేను. పాట్ కమిన్స్‌ ఆడలేని బంతులు విసురుతున్నాడు. నేను ఔటైన బంతి కచ్చితంగా 'బాల్‌ ఆఫ్ ది సిరీస్‌'గా నిలుస్తుంది. బ్యాక్‌ లెంగ్త్‌తో వేసిన ఆ బంతిని వదిలేయాలనుకున్నా. కానీ అది ఎక్స్‌ట్రా బౌన్స్‌ అయింది. మీ రోజు కానప్పుడు పొరపాట్లు జరుగుతుంటాయి' అని పుజారా తెలిపాడు.

నేను 100 శాతం ఫిట్‌నెస్‌తో లేను

నేను 100 శాతం ఫిట్‌నెస్‌తో లేను

మెల్‌బోర్న్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో చెతేశ్వర్‌ పుజారా వేలికి గాయమైన విషయం తెలిసిందే. ఆ గాయం బ్యాటింగ్‌పై ఏమైనా ప్రభావం చూపిస్తుందా అని అడిగిన ప్రశ్నకు అతడు సమాధానం ఇచ్చాడు. 'గాయం ప్రభావమేమీ లేదు. అయితే నేను 100 శాతం ఫిట్‌నెస్‌తో లేను. తక్కువ నొప్పిని భరించగలను. అయితే ఇది ఎంతో కీలక మ్యాచ్‌ కాబట్టి దూరంగా ఉండలేను' అని నయావాల్‌ చెప్పాడు.

మూడో రోజు ఆటలో 330-340 పరుగులు సాధించడానికి గొప్పగా ప్రయత్నించామని, కానీ రిషభ్‌ పంత్‌ ఔటవ్వడం టర్నింగ్ పాయింట్‌గా మారిందని పుజారా తెలిపాడు. పంత్ ఔటైన తర్వాత ఆసీస్‌ పైచేయి సాధించిందన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 244 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

జడేజా దూరమవ్వడం ప్రతికూలాంశం

జడేజా దూరమవ్వడం ప్రతికూలాంశం

గాయంతో స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా రెండో ఇన్నింగ్స్‌కు దూరమవ్వడం జట్టుకు ప్రతికూలాంశమని చెతేశ్వర్‌ పుజారా తెలిపాడు. జడేజా గైర్హాజరీతో మిగిలిన బౌలర్లపై ఒత్తిడి పెరుగుతుందని, ఎక్కువ ఓవర్లు వేయాల్సి ఉంటుందన్నాడు. అంతేకాకుండా తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు సాధించిన జడ్డూ.. రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచేవాడని పేర్కొన్నాడు. ఆల్‌రౌండర్‌గానే కాకుండా గొప్ప ఫీల్డర్‌గా జడేజా జట్టుకు విలువైన ఆటగాడని ప్రశంసించాడు. జడేజా గైర్హాజరీ జట్టుకు లోటైనా.. గొప్పగా పుంజుకుని ఆస్ట్రేలియాపై పైచేయి సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఎడమచేతి బొటనవేలుకి గాయమవ్వడంతో జడేజా మ్యాచ్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

భారత్‌ లక్ష్యం 407:

భారత్‌ లక్ష్యం 407:

భారత్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా 312/6 స్కోర్‌ వద్ద రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్డ్‌ చేసింది. కామెరాన్‌ గ్రీన్‌ (84; 132 బంతుల్లో 8x4, 4x6) ఔటయ్యాక టీ విరామ సమయంలో ఈ నిర్ణయం తీసుకుంది. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో గ్రీన్‌.. కీపర్‌ సాహా చేతికి చిక్కి పెవిలియన్‌ చేరాడు. దీంతో ఆసీస్‌ 87 ఓవర్లలో 312/6 స్కోర్‌ సాధించింది. భార‌త్ మూడో టెస్ట్ మ్యాచ్ గెల‌వాలంటే 407 ప‌రుగులు చేయాల్సి ఉంది.

బ్రిస్బేన్‌ టెస్టులో ఆడతాం.. కానీ మొదటి ఫ్లయిట్‌లోనే పంపాలి: బీసీసీఐ

Story first published: Sunday, January 10, 2021, 11:32 [IST]
Other articles published on Jan 10, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+