టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ రెండో పెళ్లి చేసుకుంటున్నాడా? అంటే అవుననే సమాధానం వినిస్తోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా అతను షేర్ చేసిన ఫొటో తీవ్ర చర్చనీయాంశమైంది. పెళ్లి కొడుకు గెటప్‌లో ఉన్న ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. షమీనే తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ఫొటోను పంచుకోవడంతో హాట్ టాపిక్‌గా మారింది.
పెళ్లి విషయం గురించి అతను ఏం చెప్పలేదు. కానీ'మీరంతా నన్ను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు'అని క్యాప్షన్ ఇచ్చాడు. షమీ, అతని కుటుంబ సభ్యులు పెళ్లి గురించి ఎలాంటి విషయం చెప్పకపోయినా.. అభిమానులు మాత్రం తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 'మళ్లీ పెళ్లికి రెడీ అయ్యారా షమీ' అని ఒకరంటే..'వరుడి గెటప్‌లో చాలా బాగున్నారు'అని మరొకరు, 'కొత్త లుక్ బాగుంది. ఇంతకీ విషయం ఏంటి'అని ఇంకొకరు కామెంట్ చేశారు.

ఈ దుస్తుల్లో షమీ అదిరిపోయారని కొందరు మెచ్చుకున్నారు. ఇక షమీ తన సతీమణి హసీన్ జహాన్‌కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరికి మనస్పర్థలు రావడం.. షమీపై హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేయడంతో గృహ హింస చట్టం కింద కేసు పెట్టింది. విడాకుల కేసుతో పాటు భరణం చెల్లించాలని కూడా ఆమె కోర్టును ఆశ్రయించింది. ఈ ఇద్దరికి ఓ పాప జన్మించగా.. ప్రస్తుతం ఆ చిన్నారి హసిన్ జహాన్ సంరక్షణలోనే ఉంది.
ఓవైపు హసీన్ జహాన్ పెట్టే టార్చర్‌ను భరిస్తూనే మహమ్మద్ షమీ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. వన్డే ప్రపంచకప్‌లో సంచలన బౌలింగ్‌తో హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. షమీ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం అతన్ని రెండో అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డుతో సత్కరించింది. అయితే ఈ అవార్డు అందుకున్న క్రమంలోనే తన స్నేహితులు షమీని సత్కరించారని, ఆ ఫొటోనే షేర్ చేశాడని అతని సన్నిహితులు తెలిపారు. రెండో పెళ్లి కాదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం చీలమండ గాయంతో బాధపడుతున్న షమీ.. ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. దాంతోనే ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు షమీని ఎంపిక చేయలేదు. ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేస్తే చివరి మూడు టెస్ట్‌లకు ఎంపికవుతాడు. లేదంటే ఐపీఎల్‌తోనే మళ్లీ మైదానంలోకి అడుగుపెడుతాడు.