ప్రపంచకప్‌లో షమీ ఇంజెక్షన్స్ సాయంతో ఆడాడు.. సంచలన విషయాలు వెలుగులోకి..!
టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ఫిట్‌నెస్‌కు సంబంధించిన సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ టీమిండియా స్టార్ పేసర్ ధీర్ఘకాలిక చీలమండ గాయంతో బాధపడుతున్నాడని, దాంతోనే సౌతాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడని ఓ ప్రముఖ న్యూస్ ఎజెన్సీ పేర్కొంది. వన్డే ప్రపంచకప్ 2023లో మహమ్మద్ షమీ ప్రతీ రోజు ఇంజెక్షన్ తీసుకొని ఆడాడని తెలిపింది.
తీవ్ర నొప్పితోనే మహమ్మద్ షమీ ప్రపంచకప్ బరిలోకి దిగాడని, నొప్పిని భరిస్తూనే అసాధారణ ప్రదర్శన కనబర్చాడని పేర్కొంది. బెంగాల్ టీమ్ మాజీ ప్లేయర్, మహమ్మద్ షమీ సన్నిహితుడు అయిన ఒకరు ఈ విషయాన్ని వెల్లడించినట్లు సదరు ఏజెన్సీ తమ కథనంలో ప్రస్తావించింది.

'మహమ్మద్ షమీకి దీర్ఘకాలిక చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. చాలా రోజులుగా అతను ఎడమ చీలమండ నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. చాలా మందికి ఈ విషయం తెలియదు. వన్డే ప్రపంచకప్ సమయంలోనూ అతను ఇంజెక్షన్స్ సాయంతోనే బరిలోకి దిగాడు. టోర్నీ మొత్తం నొప్పిని భరించాడు. వయసు పెరుగుతున్నా కొద్దీ గాయాలు నయమవ్వాలంటే చాలా సమయం పడుతోంది.'అని షమీ సన్నిహితుడు తెలిపాడు.
ఇక సౌతాఫ్రికా పర్యటనలో మహమ్మద్ షమీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అతని స్థానంలో మూడో పేసర్‌గా బరిలోకి దిగిన ప్రసిధ్ కృష్ణ తేలిపోయాడు. ప్రసిధ్ కృష్ణపై వచ్చిన విమర్శలను రోహిత్ శర్మ తిప్పికొట్టినా.. అతనికి అండగా నిలిచిన మాజీ బౌలర్లు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక మహమ్మద్ షమీ స్థానంలో ఆవేశ్ ఖాన్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. రెండో టెస్ట్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక ప్రసిధ్ కృష్ణ బౌలింగ్ తీరుపై మాజీ పేసర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 'ప్రసిధ్ కృష్ణ దారుణంగా విఫలమయ్యాడు. అతను ఇంకా టెస్ట్ క్రికెట్‌కు సిద్దమవ్వలేదు. రెండు, మూడో స్పెల్స్ వేసే స్కిల్స్ అతనికి లేవు. బౌన్సర్లు వేయగలడని అతని తీసుకున్నారు. కానీ అతను రంజీ సీజన్ ఆడి ఎన్ని ఎళ్లు అవుతుందనే విషయాన్ని మరిచిపోయారు. ఒక్క ఇండియా ఏ గేమ్ ఆడితే సరిపోదు.
బుమ్రా, షమీ, ఇషాంత్, సిరాజ్‌లా యువ బౌలర్లు రాణించలేకపోతున్నారు. ఆవేశ్ ఖాన్ సైతం ప్రసిధ్ తరహా బౌలరే. కానీ అతనికి రెడ్ బాల్ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. దాంతో అతను గుడ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయగలడు. నవ్‌దీప్ సైనీ ఇంకా ఇండియా ఏ తరఫున ఆడుతున్నాడంటేనే యువ పేసర్లు పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.'అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ భారత మజీ పేసర్ అసహనం వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications