వికెట్ నీదా.. నాదా కోహ్లీ? అన్ని సెలెబ్రేషన్స్ నువ్వే చేశాక.. ఇక నేనేం చేసుకోను!

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యర్థి ప్లేయర్స్ సై అంటే.. సై అనేలా ఉంటాడు. ఇక బౌలర్ రెచ్చగొట్టాడో మరింత ప్రమాదకరంగా వ్యవహరిస్తాడు. బౌలర్లపై బ్యాట్‌తో విరుచుకుపడే కోహ్లీ.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ వికెట్ పడినప్పుడు కూడా అతిగా సంబరాలు చేసుకుంటాడు. ఇంకా చెప్పాలంటే.. వికెట్ తీసిన బౌలర్ కంటే అతిగా సెలెబ్రేషన్స్ చేసుకుంటాడు. ఇదే విషయాన్ని సీనియర్ పేసర్ మొహ్మద్ షమీ కూడా అంగీకరించాడు. అంతేకాదు కోహ్లీపై ఓ పంచ్ కూడా వేశాడు.

ఇంగ్లండ్ టూర్ కోసం సన్నద్ధం
ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లండ్ టెస్టుల కోసం బీసీసీఐ ఇటీవల 20 మందితో కూడిన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్ 2న ఇంగ్లండ్‌కి వెళ్లనున్న కోహ్లీసేన.. సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో 18 నుంచి 23 వరకూ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తలపడి.. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో ఢీకొట్టబోతోంది. ఇందుకోసం భారత ఆటగాళ్లు ఇంట్లోనే సన్నద్ధమవుతున్నారు. ఈ టూర్‌కి ముందు మొహ్మద్ షమీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకున్నాడు.

వికెట్ నీదా.. నాదా?
'భారత జట్టులోని సీనియర్, జూనియర్ ప్లేయర్స్ దాదాపుగా అందరూ దూకుడుగా ఉంటారు. మాకంటే దూకుడుగా ఉండే ఒకే ఒక్కడు.. మా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఫాస్ట్ బౌలర్లు వికెట్ పడగొట్టినప్పుడు చాలా దూకుడుగా వ్యవహరిస్తుంటారు. బౌలర్ల కంటే ఎక్కువగా మైదానంలో కోహ్లీ సంబరాలు చేసుకుంటాడు. కొన్ని సందర్భాల్లో విరాట్ చేసుకునే సంబరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. ఓసారి సరదాగా కోహ్లీని అడిగేశా?. ఆ వికెట్ నీదా.. నాదా? అని సూటిగా అడిగేశా. అందుకు నవ్వి ఊరుకున్నాడు' అని ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీ తెలిపాడు.
WTC Final విజేత ఎవరో చెప్పేసిన వాన్.. లెక్కలేసి మరి చెప్పాడుగా!!

అన్ని సెలెబ్రేషన్స్ నువ్వే చేశాక:
'వికెట్ పడినప్పుడు విరాట్ కోహ్లీ బౌలర్ల కంటే ఎక్కువగా సెలెబ్రేషన్స్ చేసుకుంటాడు. ఓసారి నేను వికెట్ తీసినప్పుడు నా వద్దకు వచ్చి.. ఏంటి నువ్ సంతోషంగా లేవు అని అడిగాడు. అన్ని సెలెబ్రేషన్స్ నువ్వే చేశాక.. ఇక నేనేం చేసుకోను అని అన్నాను. ఏదేమైనా మైదానంలో ఆనందంగా ఉండడం ఎంతో ముఖ్యం. విరాట్ ఇప్పటివరకు జట్టును అద్భుతంగా నడిపించాడు. అంతేకాదు దూకుడైన బ్యాట్స్‌మన్. కోహ్లీతో పోలిస్తే రోహిత్ శర్మ మైదానంలో చాలా కూల్‌గా ఉంటాడు. బ్యాటింగ్ చేసేటపుడు మాత్రమే దూకుడుగా ఉంటాడు. బౌలర్లకి రోహిత్ చక్కటి సలహాలు కూడా ఇస్తుంటాడు' అని మొహ్మద్ షమీ చెప్పుకొచ్చాడు.

అప్పుడు మాత్రమే కోపగించుకుంటాడు
ఇటీవల షమీ తన సారథి విరాట్ కోహ్లీ గురించి పలు విషయాలు పంచుకున్నాడు. 'కోహ్లీ మా పేస్ బౌలింగ్ దళానికి ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలిచాడు. మాకెంతో స్వేచ్ఛనిచ్చాడు. మా ప్రణాళికలు విఫలమైనప్పుడు మాత్రమే అతడు కోపగించుకుంటాడు. లేకపోతే మేం ఏం చేసినా ఏమనడు. బాగా బౌలింగ్ చేయమని చెప్తాడు. మాతో కలిసి జోకులు వేస్తాడు. జట్టులోని ప్రతి ఒక్కరితో సరాదాగా ఉంటాడు. అందరితో చిన్నప్పటి మిత్రుడిలా కలిసిపోతాడు. నా వరకు అయితే.. నా చిన్నప్పటి దోస్త్ లాగే కోహ్లీ కనిపిస్తాడు' అని షమీ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications