
ఇప్పటికే ఇంగ్లీష్ గడ్డపైకి కివీస్
ఛాంపియన్‌షిప్ ఫైనల్స్, ఇంగ్లండ్ టెస్టుల కోసం బీసీసీఐ ఇటీవల 20 మందితో కూడిన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ 2-3 రోజుల్లో ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో భారత ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు చేరనున్నారు. అక్కడ వారం పాటు క్వారంటైన్‌లో ఉంటారు. జూన్ 2న ముంబై నుంచి భారత బృందం బయలుదేరనుంది. ఇక సౌథాంప్టన్ చేరుకున్నాక అక్కడా కఠిన క్వారంటైన్‌లో ఉంటారు. ఆపై ప్రాక్టీస్ చేసి ఫైనల్ ఆడుతారు. మరోవైపు ఇప్పటికే ఇంగ్లీష్ గడ్డపైకి చేరుకున్న న్యూజిలాండ్ టీమ్..ఫైనల్ మ్యాచ్‌కి ముందు ఇంగ్లండ్‌తో రెండు టెస్టులను ఆడనుంది.

న్యూజిలాండ్‌కే గెలిచే అవకాశం ఎక్కువ
తాజాగా స్పార్క్ స్పోర్ట్‌తో మైకేల్ వాన్ మాట్లాడుతూ... 'టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తప్పకుండా గెలుస్తుంది. అందుకు అసలు కారణం ఏంటంటే.. ఇంగ్లండ్ పరిస్థితులు, డ్యూక్ బాల్. అంతేకాదు కోహ్లీసేన ఈ ఫైనల్ మ్యాచ్ ముంగిట ఇక్కడికి వస్తోంది. అయితే న్యూజిలాండ్ అప్పటికే ఇంగ్లండ్ గడ్డపై రెండు టెస్టులు ఆడుతుంది. ఇక ఇంగ్లీష్ జట్టుతో వార్మప్ మ్యాచ్‌లను కూడా ఆడబోతోంది. ఇవి కివీస్ ఆటగాళ్లకు మేలుచేయనున్నాయి. ఇలా అన్ని చూసుకుంటే.. భారత్‌తో పోలిస్తే న్యూజిలాండ్‌కే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది' అని అభిప్రాయపడ్డాడు.
వాషింగ్టన్ సుందర్ కలలను నెరవేర్చేందుకు.. కఠిన నిర్ణయం తీసుకున్న అతడి తండ్రి! కారణం బీసీసీఐ!!

అత్యుత్తమంగా కేన్ సేన
ప్రస్తుత న్యూజిలాండ్ జట్టు కివీస్ చరిత్రలో అత్యుత్తమంగా ఉందని మైకేల్ వాన్ పేర్కొన్నాడు. 'న్యూజిలాండ్ జట్టుకు చాలా గొప్ప టీంలు లేవు. కానీ గొప్పగొప్ప ఆటగాళ్లు మాత్రం ఉన్నారు. 80లలో రిచర్డ్ హాడ్లీ మరియు మార్టిన్ క్రోవ్ టెస్ట్ క్రికెట్ ఆడిన గొప్ప వారిలో ఉన్నారు. ఒక జట్టుగా బ్రెండన్ మెక్కల్లమ్ బృందం బాగుంది. అయితే వారు స్థిరమైన ప్రదర్శన చేయలేదు.
కేన్ విలియమ్సన్‌కు క్రమశిక్షణ కలిగిన టెస్ట్ జట్టు ఉంది. నాణ్యమైన జట్లకుఉండే అన్ని లక్షణాలు ప్రస్తుత జట్టుకు ఉన్నాయి. అందుకే కివీస్ ఫేవరేట్‌గా కనబడుతోంది' అని ఇంగ్లీష్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అన్నాడు. వాన్ ఎప్పుడూ టీమిండియాపై విమర్శలు చేస్తాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కఠిన సవాళ్లు ఎదురవుతాయి
'టెస్టు ఛాంపియన్‌షిప్ సరైన ఉద్దేశాన్ని మనం చూడగలిగాం. ఇది సుదీర్ఘ ఫార్మాట్‌పై ఎంతో ఆసక్తి పెంచింది. మేం ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడుతున్నందుకు ఆత్రుతగా ఉంది. ఇందులో గెలిస్తే మరింత బాగుంటుంది. తొలిసారి టైటిల్ కాబట్టి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. టీమిండియాతో ఎప్పుడు తలపడ్డా కఠిన సవాళ్లు ఎదురవుతాయి. వారితో ఆడటం ఎప్పుడూ ఉత్కంఠకరంగానే ఉంటుంది' అని న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ తాజాగా అన్నాడు.


Click it and Unblock the Notifications












