For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హార్దిక్ పాండ్యా అయినా.. ఎవరైనా ఆటగాళ్లపై అరవద్దు: మహమ్మద్ షమీ

పబ్లిక్ ఫిగర్స్‌ను కోట్ల మంది అనుసరిస్తారు కాబట్టి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని టీమిండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ అన్నాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ఆడే మహమ్మద్ షమీ పట్ల స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అనుచితంగా ప్రవర్తించాడు.

ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యా.. బౌండరీ లైన్ వద్ద మహమ్మద్ షమీ మిస్ ఫీల్డ్ చేయడంతో సహనం కోల్పోయి గట్టిగా అరిచాడు. సీనియర్ ఆటగాడనే కనీస గౌరవం లేకుండా అసభ్య పదజాలంతో దూషించాడు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది.

Mohammed Shami says We should Control our emotions over getting abused by Hardik Pandya

హార్దిక్ పాండ్యాపై నెటిజన్లు మండిపడ్డారు. హార్దిక్ కెప్టెన్సీకి పనికిరాడని ట్రోల్ చేశారు. ఆట కంటే ముందు సీనియర్ ఆటగాళ్లకు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని హితవు పలికారు. తాజాగా ఈ ఘటనపై ఓ ఇంటర్వ్యూలో మహమ్మద్ షమీ స్పందించాడు. ఇలాంటి విషయాలపై తాను పెద్దగా రియాక్ట్ అవ్వనని తెలిపాడు. కానీ పరిస్థితి మరింత దిగజారితేనే మాట్లాడుతానని చెప్పాడు. హార్దిక్ పాండ్యాతో తనకు 10 ఏళ్ల స్నేహం ఉందని గుర్తు చేశాడు.

'సాధారణంగా ఇలాంటి విషయాలపై పెద్దగా నేను రియాక్ట్ అవ్వను. మరీ హద్దులు ధాటితేనే నోరు విప్పుతాను. హార్దిక్ పాండ్యాతో నాకు మంచి సంబంధాలున్నాయి. మేం మంచి స్నేహితులం. ఆ సమయంలో అతను ఏం చేశాడో గుర్తించలేకపోయాడు. 10 ఏళ్లుగా మేం ఒకరికొకరం తెలుసు. తనను అన్న మాటలను మరిచిపోయానని హార్దిక్ చెప్పాడు.

కోట్ల మంది చూస్తుంటారు కాబట్టి.. మనం మన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.'అని మహమ్మద్ షమీ చెప్పుకొచ్చాడు.ఐపీఎల్ 2025 మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ రిటైన్ చేసుకోకపోతే ఏం చేస్తారు? అనే ప్రశ్నకు షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రిటైన్ చేసుకోకపోతే తాను ఏం బాధపడనని, ఏ జట్టు ఎంచుకుంటే ఆ టీమ్ తరఫున సత్తా చాటేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు.

'రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ తరఫున నేను 48 వికెట్లు తీసాను. ఒకవేళ వాళ్లు నన్ను రిటైన్ చేసుకోకపోతే నేను ఏం బాధపడను. ఏ జట్టు తీసుకుంటుందో ఆ జట్టు తరఫున ఆడుతాను. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున నాకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. పంజాబ్ కింగ్స్ తరఫున మూడు సీజన్లలో 60 వికెట్లు తీసాను.

వాళ్లు నన్ను రిటైన్ చేసుకోకుండా గుజరాత్ టైటాన్స్‌కు ట్రేడ్ చేశారు. ఆ జట్టు తరఫున 2 సీజన్లలో 48 వికెట్లు పడగొట్టాను. వాళ్లు రిటైన్ చేసుకున్నా చేసుకోకపోయినా.. నాకు వచ్చే నష్టం ఏం లేదు. గుజరాత్ టైటాన్స్‌కు స్టార్ పెర్ఫామెర్ కావాలనుకుంటే నన్ను అంటిపెట్టుకుంటుంది. కానీ చూడటానికి బాగుండే ఆటగాడు కావాలనుకుంటే నాకు బదులు ఓ మోడల్‌ను తీసుకుంటుంది.'అని మహమ్మద్ షమీ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, July 21, 2024, 14:01 [IST]
Other articles published on Jul 21, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+