Mohammed Shami: ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ బ్యాటర్ అతను!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలపై స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్ విరాట్ కోహ్లీ అని చెప్పిన షమీ.. వరల్డ్ బెస్ట్ డేంజరస్ బ్యాట్స్‌మన్ మాత్రం రోహిత్ శర్మ అని తెలిపాడు. ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వరల్డ్ బెస్ట్ బ్యాటర్ ఎవరు? అనే ప్రశ్నకు షమీ ఈ విధంగా సమాధానమిచ్చాడు.
'ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ విరాట్ కోహ్లీ. అతను ఎన్నో రికార్దులను అధిగమించాడు. నా అభిప్రాయం ప్రకారం వరల్డ్ బెస్ట్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ బ్యాటర్ ఎవరని అడిగితే మాత్రం.. నేను రోహిత్ శర్మ పేరు చెబుతాను. అతను బౌలర్లను చీల్చి చెండాడుతాడు.

ఇక బెస్ట్ కెప్టెన్ మాత్రం మహేంద్ర సింగ్ ధోనీ. అతని సారథ్యంలో భారత్ ఎన్నో విషయాలు సాధించింది. అతను సాధించిన విజయాలు మరే సారథి సాధించలేదు. అందుకే నా దృష్టిలో ధోనీ అత్యుత్తమ బ్యాటర్.'అని షమీ చెప్పుకొచ్చాడు.
వ్యక్తిగత జీవితం గురించి కూడా షమీ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తన కూతురంటే తనకు ఎంతో ఇష్టమని, ఆమెను ఎంతో మిస్సవుతున్నానని తెలిపాడు. 'నా కూతుర్ని నేను చాలా మిస్సవుతున్నాను. ఆమెతో మాట్లాడేందుకు నేను ఎప్పుడూ ప్రయత్నిస్తాను. కానీ ఇప్పటి వరకు నా కుమార్తెను కలవడానికి ఆమె తల్లి అనుమతించలేదు.'అని మహమ్మద్ షమీ చెప్పుకొచ్చాడు.
చీలమండ గాయంతో జట్టుకు దూరంగా ఉన్న మహమ్మద్ షమీ.. ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. వన్డే ప్రపంచకప్ తర్వాత అతను ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్ట్‌లకు కూడా షమీ దూరంగా ఉండనున్నాడు. అతను నేరుగా ఐపీఎల్ 2024లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక వన్డే ప్రపంచకప్‌లో మహమ్మద్ షమీ సంచలన ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే.
ఓవైపు గాయంతో బాధపడుతూనే ఇంజెక్సన్స్ తీసుకొని బరిలోకి దిగాడు. అసాధారణ ప్రదర్శనతో హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications