Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ బ్యాటింగ్ కవిత్వంలా ఉంటుంది.. యువ క్రికెటర్లకు అతనో బెస్ట్ ప్యాకెజ్!

 Mohammed Shami Says Rohit Sharma a pure batsman, you get to learn while bowling to him:

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్ క‌విత్వాన్ని పోలి ఉంటుందని, అతని సొగసైన బ్యాటింగ్ గురించి ఎంత మాట్లాడినా తక్కువేనని భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా క్రీడా టోర్నీలన్నీ రద్దవడంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్వారంటైన్ సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతూ.. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు.

సుకుమారంగా..

సుకుమారంగా..

ఈ నేపథ్యంలో భారత పేసర్ మహ్మద్ షమీతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌ సెషన్ నిర్వహించిన ఇర్ఫాన్ పఠాన్‌.. హిట్‌మ్యాన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.

`మైదానంలో రోహిత్ శ‌ర్మ ఆడుతుంటే.. స్టార్ బ్యాట్స్‌మ‌న్‌లా కాకుండా.. అత‌డో క‌విలా క‌నిపిస్తాడు. అత‌డి బ్యాటింగ్ చ‌క్క‌టి క‌విత్వాన్ని త‌ల‌పిస్తుంది. క‌విత్వం ఏ విధంగానైతే సున్నితంగా వినసొంపుగా అనిపిస్తుందో.. అత‌డి బ్యాటింగ్ అచ్చం అలాగే ఉంటుంది'అని ఇర్ఫాన్ కొనియాడాడు.

స్వచ్చమైన బ్యాట్స్‌మన్

స్వచ్చమైన బ్యాట్స్‌మన్

ఇక పఠాన్ వ్యాఖ్యలకు బదులిస్తూ మహ్మద్ షమీ కూడా భారత ఓపెనర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘రోహిత్ గొప్ప ఓపెన‌ర్‌. అత‌డు క్రికెట్‌లోని అన్నీ నైపుణ్యాలు తెలిసిన ప్యాకేజీ లాంటివాడు. యువ బ్యాట్స్‌మెన్ అత‌డి ఆట చూసి ఎంతో నేర్చుకోవ‌చ్చు. బంతిని అతడు బాదే తీరును చూసి బౌలర్లు.. విభిన్న పరిస్థితుల్లో అతను ఆడే షాట్స్‌తో బ్యాట్స్‌మెన్ ఎంతో నేర్చుకోవచ్చు.`అని షమీ కొనియాడాడు. ప్రస్తుతం వన్డేల్లో విరాట్ కోహ్లీ తర్వాత రెండో ర్యాంకుల్లో ఉన్న రోహిత్.. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే.

కూలీల గోస చూస్తే కడుపు తరుక్కుపోతుంది..

కూలీల గోస చూస్తే కడుపు తరుక్కుపోతుంది..

ఇటీవల స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్న షమీ.. దేశంలోని లాక్‌డౌన్ వలస కూలీల పడుతున్న కష్టాలను చూస్తే కడుపు తరుక్కు పోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. రాజస్థాన్ నుంచి బిహార్ బయలు దేరిన ఓ వలస కూలి తిండిలేక తన ఇంటి ముందు సొమ్మసిల్లి పడిపోయాడని తెలిపాడు. అతనికి ఆహారం అందించి తనకు తోచిన సాయం చేశానన్నాడు. తన ఇళ్లు హైవేకు సమీపంగా ఉండటంతో వలస కూలీల అవస్థలు తనకు కనబడుతున్నాయని, వారి గోస చూస్తే కడుపు తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు.

Story first published: Sunday, April 19, 2020, 20:07 [IST]
Other articles published on Apr 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+