Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఇద్దరు తెలుగు హీరోలు నా ఫేవరేట్: మహమ్మద్ షమీ

సౌత్‌లో టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్‌‌లు అంటే తనకు ఇష్టమని టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ తెలిపాడు. సెలెబ్రిటీ హెయిర్ ప్లాంటెషన్ సెంటర్‌ను ప్రారంభించేందుకు హైదరాబాద్‌కు వచ్చిన మహమ్మద్ షమీ.. ఓ తెలుగు పాపులర్ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడారు.

హైదరాబాద్‌తో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పిన షమీ.. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా బిర్యానీ తినకుండా వెళ్లనని తెలిపాడు. ఇక హైదరాబాద్, శిల్పా హిల్స్‌లోని యుజెనిక్స్ హెయిర్ ట్రాన్స్‌ప్లెంట్ సెంటర్‌‌ను ప్రారంభించిన షమీ.. తాను ఈ సంస్థలోని హెయిర్ ప్లాంటేషన్ చేసుకున్నానని చెప్పాడు. గతంలో మాదిరిగా తనకు ఒత్తుగా జుట్టు వచ్చిందని కూడా చూపించాడు.

 Mohammed Shami says My favourite actors from South are Jr NTR and Prabhas

ఈ సందర్భంగా తన బయోపిక్‌కు సంబంధించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'హైదరాబాద్ నగరంతో మంచి అనుబంధం ఉంది. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా.. బిర్యానీ తినకుండా వెళ్లను. బిర్యానీ అంత టేస్టిగా ఉంటుంది. నా బయోపిక్ గురించి ఇప్పుడు ఎలాంటి ఆలోచనలు లేవు. ఒకవేళ తీసినా ఎవరు నటించారనేది కూడా చెప్పలేను.

సౌత్ సినిమాలను బాగానే చూస్తాను. తెలుగు, తమిళం అర్థం కాదు కాబట్టి డబ్బింగ్ అయిన మూవీస్ చూస్తుంటాను. సౌత్‌లో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. క్రికెట్ ఆడే సమయంలో సినిమాల గురించి సరదాగా మాట్లాడుకుంటాం. సౌత్ హీరోల గురించి చర్చించుకుంటాం. నా హెయిర్ ప్లాంటేషన్ బాగానే జరిగింది. గతంలో కంటే బాగా జుట్టు వచ్చింది. పూర్తి డాక్టర్ల పర్యవేక్షణలో జరిగింది.

అందుకే ఈ సంస్థకు నేను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాను. నేను చేసుకున్న తర్వాత రిజల్ట్ చూసే ఈ నిర్ణయం తీసుకున్నాను.'అని మహమ్మద్ షమీ చెప్పుకొచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2023 అనంతరం మహమ్మద్ షమీ భారత జట్టుకు దూరమయ్యాడు. చీలమండ గాయంతో బాధపడుతున్న అతను ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లోనే మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు.

Story first published: Monday, February 19, 2024, 16:55 [IST]
Other articles published on Feb 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+