Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గొప్ప మనసు చాటుకున్న మహమ్మద్ షమీ!

Mohammed Shami: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ గొప్ప మనసును చాటుకున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో సంచలన ప్రదర్శనతో అందర్నిఆకట్టుకున్న షమీ.. తాజాగా తన చేతలతో ప్రజల మనసులను గెలుచుకున్నాడు. రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిని మహమ్మద్ షమీ కాపాడాడు. ఆ ఘటనకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా వేదికగా అతనే స్వయంగా పంచుకున్నాడు.

శనివారం రాత్రి ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ రోడ్డు మార్గంలో ఓ కారు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకుపోయింది. ఆ వెనుక కారులోనే వస్తున్న మహమ్మద్ షమీతో పాటు ఇతర వాహనదారులు వెంటనే స్పందించి బాధితుడిని రక్షించి ఆసుప్రతికి తరలించారు. కారు ప్రమాదానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షమీ అభిమానులతో పంచుకున్నాడు.

Mohammed Shami Saves Mans Life In Nainital After Road Accident, shares video on social media

'అతను అదృష్టవంతుడు. ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. దేవుడు అతనికి మళ్లీ జీవితం ఇచ్చాడు. నైనిటాల్‌లో అతని కారు ఘాట్ రోడ్డు నుంచి పక్కకు దూసుకుపోయింది. నా కారుకు కాస్త ముందుగానే ఈ సంఘటన చోటు చేసుకుంది. వెంటనే అక్కడున్న వారితో కలిసి సురక్షితంగా అతన్ని బయటకు తీసుకొచ్చాం. అతని పరిస్థితి బాగానే ఉంది.'అని షమీ ఆ వీడియోకు క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టమని షమీ తెలిపాడు. ఫిషింగ్ చేయడాన్ని కూడా తాను తెగ ఆస్వాదిస్తానని చెప్పాడు. దూరప్రాంతాలకు డ్రైవింగ్ కూడా ఇష్టమేనని, కార్లు, బైకులు నడపడటమంటే మహా సరాదానని తెలిపాడు. టీమిండియాకు ఆడటం మొదలు పెట్టినప్పటి నంచి బైక్ రైడింగ్ ఆపేసానని చెప్పిన షమీ.. గాయాలైతే ఇబ్బందులవుతాయనే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశాడు. బైక్స్, కార్లే కాకుండా ట్రాక్టర్, బస్, ట్రక్కులను కూడా నడిపేవాడినని, ఓ సారి ట్రాక్టర్‌తో చెరువులోకి దూసుకెళ్లడంతో తన తండ్రి మందలించాడని గుర్తు చేసుకున్నాడు.

టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ వన్డే ప్రపంచకప్ 2023లో సంచలన ప్రదర్శన కనబర్చాడు. ఆడింది ఏడు మ్యాచ్‌లే అయినా 24 వికెట్లతో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా.. అత్యధికసార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.

Story first published: Sunday, November 26, 2023, 11:43 [IST]
Other articles published on Nov 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+