వేశ్యలను కూడా వదల్లేదు.. అరెస్ట్ చేయండి! మహమ్మద్ షమీపై సంచలన ఆరోపణలు!
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్‌లో టీమిండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుంటే మరోవైపు అతని నుంచి విడిపోయిన భార్య హసీన్ జహాన్ మాత్రం సంచలన ఆరోపణలు చేసింది. షమీ స్త్రీలోలుడని, ఆడది కనబడితే ఆగలేడని పేర్కొంది. చివరకు పడుపు వృత్తితో బతికే వేశ్యలతోనూ షమీ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
మంగళవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. నాలుగేళ్ల క్రితమే షమీతో పాటు అతని కుటుంబ సభ్యులపై సంచలన ఆరోపణలు చేసిన హసీన్ జహాన్.. కుమార్తెతో కలిసి అతనికి దూరంగా ఉంటుంది. నెలవారీ భరణంగా రూ.10 లక్షలు చెల్లించాలని కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. కోల్‌కతా కోర్టు మాత్రం.. ప్రతీ నెలా లక్షా 30 వేలు చెల్లిస్తే సరిపోతుందని ఆదేశించింది. అంతేకాకుండా షమీ అరెస్ట్‌పై కూడా స్టే విధించింది.

గతంలో వయసు విషయంలో షమీ తప్పుడు ధృవ పత్రాలు సమర్పించాడని, ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడని ఆరోపణలు గుప్పించగా.. బీసీసీఐ విచారణ జరిపి క్లీన్ ఛీట్ ఇచ్చింది. ఇన్నాళ్లు కాస్త సైలెంట్‌గా ఉన్న హసీన్ జహాన్ మరోసారి సుప్రీం కోర్టుకు వెళ్లి అతనిపై ఆరోపణలు గుప్పించింది.
మహమ్మద్ షమీ దగ్గర రెండో మొబైల్ ఫోన్ ఉండేదని, దాని ద్వారా అతను వివాహేతర సంబంధాలు కొనసాగించేవాడని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది. వేశ్యలతో కూడా షమీకి సంబంధాలున్నాయని ఆరోపించింది. విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు కూడా షమీ లైంగిక అవసరాల కోసం అడ్డదారులు తొక్కుతాడని తెలిపింది. నాలుగేళ్లుగా షమీ తప్పించుకొని తిరుగుతున్నాడని, అతన్ని అరెస్ట్ చేసేందుకు ఆదేశాలు జారీ చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది.
మరోవైపు ఐపీఎల్ 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నాడు.ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్2లో షమీ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. కానీ ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓటమిపాలైంది. ఇషాంత్ శర్మ సూపర్ బౌలింగ్‌తో ఢిల్లీ గెలుపొందింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications