Mohammed Shami మంచి భర్త అయ్యుంటే బాగుండేది: హసీన్ జహాన్
World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్న మహమ్మద్ షమీపై అతని మాజీ సతీమణి హసీన్ జహాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అద్భుత బౌలర్ అయిన మహమ్మద్ షమీ మంచి భర్తగా ఉండి ఉంటే.. తమ జీవితం హాయిగా ఉండేదని తెలిపింది. అతను గొప్ప క్రికెటరే అయినా.. మంచి వ్యక్తి కాదని ఆరోపించింది.
తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహమ్మద్ షమీ సంచలన ప్రదర్శనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. 'మహమ్మద్ షమీ.. మంచి క్రికెటరే కానీ.. మంచి వ్యక్తి కాదు. అతను మంచి భర్త అయితే.. తాము సుఖ జీవితాన్ని గడిపేవాళ్లం. కూతురితో పాటు.. తామిద్దరం సంతోషంగా ఉండేవాళ్లం.

మంచి ఆటగాడు మాత్రమే కాకుండా.. మంచి భర్త, మంచి తండ్రిగా కూడా ఉంటే అతనికి మరింత గౌరవం దక్కేది. షమీ చేసిన తప్పులు.. దురాశ అతని వ్యక్తిత్వం కారణంగా తాము ముగ్గురం (షమీ, జహాన్, వారి కుమార్తె) కష్టాలు ఎదుర్కోవల్సి వచ్చింది. షమీ డబ్బు ద్వారా తనకు వ్యతిరేకంగా ఉన్న అంశాలను దాచడానికి ప్రయత్నిస్తున్నాడు'అని హసీన్ జహాన్ చెప్పుకొచ్చింది.
ఇక న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో మహమ్మద్ షమీ ఏడు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనపై స్పందించిన హసీన్ జహాన్.. 'నాకు ప్రత్యేకంగా ఏమీ అనిపించలేదు. అయితే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడం గొప్ప అనుభూతినిచ్చింది. ఫైనల్లోనూ భారత్ గెలవాలని ప్రార్థిస్తున్నాను'అని తెలిపింది.
షమీని పెళ్లి చేసుకునేందుకు రెడీ అంటూ బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సెలెబ్రిటీలకు ఇవన్నీ సహజమని తెలిపింది. పాయల్ ఘోష్ చేసిన వ్యాఖ్యలపై తాను మాట్లాడలేనని చెప్పింది.
ఈ ఏడాది ఆరంభంలో హసీన్ జహాన్‌కు నెలకు రూ. లక్షా 30 వేలు భరణం కింద చెల్లించాలని మహమ్మద్ షమీకి కోర్టు ఆదేశించింది. 2014, జూన్ 6న ఛీర్ గర్ల్ అయిన హసీన్ జహాన్‌ను మహమ్మద్ షమీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2015లో వీరికి ఓ పాప జన్మించింది. 2018, మార్చి 8న మహమ్మద్ షమీపై హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేయడంతో పాటు గృహ హింస కేసు పెట్టింది. అప్పటి నుంచి ఈ ఇద్దరూ వేరుగా ఉంటున్నారు.
హసీన్ జహాన్ కారణంగా షమీ.. తీవ్ర మానసిక క్షోభను అనుభవించాడు. ఈ విషయాన్ని అతనే వెల్లడించాడు. డిప్రెషన్ కారణంగా రెండు, మూడు సార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించినట్లు పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications