Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మోదీగారు.. దేశం పేరును మార్చండి.. మహమ్మద్ షమీ భార్య సంచలన వ్యాఖ్యలు!

Mohammed Shamis wife Hasin Jahan makes special request to PM Narendra Modi and Amit Shah

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ భార్య హసిన్ జహాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో షమీపై సంచలన ఆరోపణలు చేసిన హసిన్ జహాన్.. అతను ఓ మోసకారని, ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడని పేర్కొంది. వయసు విషయంలో సైతం బీసీసీఐని తప్పుదోవ పట్టించాడని, ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపించింది. అయితే ఈ వ్యాఖ్యలపై విచారణ చేపట్టిన బీసీసీఐ.. షమీకి క్లీన్ చీట్ ఇచ్చింది. ఆ తర్వాత షమీ నుంచి విడిపోయిన హసిన్ జహాన్.. తనకు అతని నుంచి భరణం ఇప్పించాలని కోల్‌కతా హై కోర్టును సంప్రదించింది.

దేశం పేరు మార్చాలంటూ..

దేశం పేరు మార్చాలంటూ..

ఇక యావత్ భారత్ 75వ స్వతంత్ర్య దినోత్సవ వేడుకులను అంగరంగ వైభవంగా జరుపుకుంటన్న సందర్భంలో హసిన్ జహాన్ ఓ వింత వాదనను తెరపైకి తీసుకొచ్చింది. దేశం పేరు మార్చాలని ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా‌ను కోరింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసిన హసిన జహాన్.. అందులో సంతల్య్, సోనియాలతో కలిసి ఆమె ప్రముఖ బాలీవుడ్ గీతం 'దేశ్ రంగీలా' పాటకు నృత్యం చేసింది.

హిందుస్తాన్ అని పెట్టాలి..

హిందుస్తాన్ అని పెట్టాలి..

ఈ పోస్ట్ క్యాప్షన్‌గా దేశం పేరు మార్చాలని కోరింది. 'మన దేశం మనకు గర్వకారణం. ఐ లవ్ భారత్. మనదేశం పేరు 'భారత్' అని గానీ 'హిందూస్తాన్' అని గానీ ఉండాలి. గౌరవనీయులైన ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలకు నాదొక విజ్ఞప్తి. ప్రస్తుతం మనం పిలుస్తున్న 'ఇండియా' పేరు మార్చి 'భారత్' అని గానీ, 'హిందుస్తాన్' అని గానీ పెట్టండి. అప్పుడు ప్రపంచం మొత్తం మనను అదే పేరుతో పిలుస్తుంది.'అని హిందీలో రాసుకొచ్చింది.

2018 నుంచి దూరం..

2018 నుంచి దూరం..

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. ఆమె చేసిన ఈ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఇది అవసరమా? అని కొందరంటే.. మరికొందరు మాత్రం ఆమె వాదనను సమర్థిస్తున్నారు. ఇక 2014లో మహమ్మద్ షమీని ప్రేమించి పెళ్లి చేసుకున్న హసిన్ జహాన్ ఓ కూతురికి కూడా జన్మనిచ్చింది. నాలుగేళ్ల పాటు సాఫిగా సాగిన వారి వివాహ బంధానికి 2018లో తెరపడింది. సోషల్ మీడియా వేదికగా షమీపై లైంగిక ఆరోపణలు చేసిన హసిన్ జహాన్.. అప్పటి నుంచి అతనికి దూరంగా ఉంటుంది. మోడల్ అయిన హసిన్ జహాన్ మళ్లీ తన కెరీర్‌పై దృష్టిపెట్టింది. షమీ టీమిండియా షెడ్యూల్స్‌తో బిజీగా గడుపుతున్నాడు.

Story first published: Monday, August 15, 2022, 13:45 [IST]
Other articles published on Aug 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+