Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మరో బోల్డ్ వీడియోతో రెచ్చిపోయిన షమీ వైఫ్.. మండిపడుతున్న ఫ్యాన్స్!

Mohammed Shamis wife Hasin Jahan gets criticised after she shares Party video

కోల్‌కతా: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ సతీమణి హసీన్ జహాన్ మరో బోల్డ్ వీడియోతో అభిమానుల ఆగ్రహానికి గురైంది. రెండేళ్ల క్రితం తమ మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా షమీకి దూరంగా ఉంటున్న హసీన్.. వీలు దొరికినప్పుడల్లా అతనిపై విమర్శలు గుప్పిస్తోంది. 2018లో అతనిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ వేధింపుల కేసు కూడా పెట్టింది.

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బోల్డ్ వీడియోలు, హాట్ ఫొటోలను షేర్ చేస్తూ తరుచు అభిమానుల ఆగ్రహానికి గురవుతుంది. ట్రోలింగ్‌కు దిగినా.. ఏ మాత్రం లెక్కచేయకుండా మరిన్నీ వీడియోలు, ఫొటోలతో వారిని రెచ్చగొడుతుంది. మొన్న మహ్మద్ షమీతో ఉన్న నగ్న ఫొటోను షేర్ చేసిన హసీన్ జహాన్.. 'నీకేం లేనప్పుడు నన్ను ఆరాధించావు. ఇప్పుడు నీకు అన్నీ ఉన్నాయి. నేనే మలినం అయిపోయా. నిజం, అబద్ధాలు ఎప్పటికీ దాగవు'అంటూ షమీనే టార్గెట్ చేసింది.

తాజాగా హుక్కాసెంటర్‌లో స్నేహితులరాలితో ఏంజాయ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోను చూసిన అభిమానులు ఆమెపై మరోసారి మండిపడుతున్నారు. రాయలేని పదాలతో బండబూతులు తిడుతున్నారు. సిగ్గు, శరం అన్ని విడిచిందని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. షమీ కెరీర్‌ను దెబ్బతీసి, ఇప్పుడు కొత్త నాటకం ఆడుతోందని మండిపడుతున్నారు.

ఇక హసీన్ జహాన్ కారణంగా తీవ్ర మానసిక క్షోభను అనుభవించిన షమీ.. ఆ బాధను తట్టుకోలేక మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు కూడా తెలిపాడు. కానీ కుటుంబ సభ్యుల అండతో ఈ గండం నుంచి గట్టెక్కానని చెప్పుకొచ్చాడు. ఇక 2014లో షమీ.. హసీన్‌ జహాన్‌‌ను ప్రేమించి పెళ్లిచేసుకోగా.. వారికి ఓ పాప జన్మించింది. నాలుగేళ్ల పాటు వారి కాపురం సజావుగానే సాగినా.. అనంతరం నెలకొన్న మనస్పర్థలతో ప్రస్తుతం ఈ ఇద్దరు విడిగా ఉంటున్నారు.

Story first published: Monday, June 8, 2020, 22:18 [IST]
Other articles published on Jun 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+