గంభీర్ కాదు.. నా ఫేవరేట్ కోచ్ అతనే: మహమ్మద్ షమీ
టీమిండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ తన ఫేవరేట్ కోచ్ ఎవరో చెప్పారు. తాను గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో ఎక్కువగా ఆడలేదని, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, రవి శాస్త్రిల హయాంలో మంచి క్రికెట్ ఆడానని తెలిపాడు. ఈ నలుగురిలో ఒకరిని ఎంపిక చేసుకోమంటే మాత్రం రవిశాస్త్రి ఎంచుకుంటానని చెప్పాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత మహమ్మద్ షమీ భారత్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఫిట్‌నెస్ సాధించి దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటినా సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో యువ బౌలర్లకే ప్రాధాన్యత ఇస్తామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. పరోక్షంగా షమీ, భువనేశ్వర్ కుమార్ వంటి సీనియర్ పేసర్లు రిటైర్ అవ్వడమే ఉత్తమమని తెలియజేశాడు. అయితే 2027 వన్డే ప్రపంచకప్‌కు మహమ్మద్ షమీని తీసుకోవాలని, సౌతాఫ్రికా వంటి కండిషన్స్‌లో అతని అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షమీని ఫేవరేట్ కోచ్ ఎవరు? అని ప్రశ్నించగా.. రవి శాస్త్రి పేరు చెప్పాడు. 'ఎవరు గొప్ప కోచ్ అనే పోల్చడం కాస్త కష్టమే. గౌతీ భాయ్ హయాంలో నేను ఎక్కువగా ఆడలేదు. నేను ఎక్కువగా రాహుల్ భాయ్, అనిల్ భాయ్, రవిశాస్త్రి హయాంలో మంచి క్రికెట్ ఆడాను. ఈ నలుగురిలో ఒకర్ని ఎంచుకోమంటే మాత్రం రవి భాయ్‌ను ఎంపిక చేసుకుంటాను. ఎందుకంటే ఆటగాళ్లకు అతను పూర్తి స్వేచ్ఛ ఇస్తాడు. అతని హయాంలో నేను స్వేచ్ఛగా ఆడాను. అంతేకాకుండా రవి శాస్త్రి దూకుడు ఎంతలా ఉండేదంటే ప్రతీ మ్యాచ్ మేం గెలవడానికి ఆడుతున్నామా అన్నట్లుగా ఉండేది. రవి శాస్త్రి కోచింగ్‌ను బాగా ఎంజాయ్ చేసేవాడిని.
2023 వన్డే ప్రపంచకప్ నాకు ఎప్పుడూ గుర్తిండిపోతుంది. కానీ నా మైండ్‌లో కప్ గెలవలేదన్న బాధ మాత్రం అలాగే ఉండిపోయింది. ఐసీసీ ఈవెంట్లలో నేను మిస్సైన మ్యాచ్‌లు ఆడి ఉంటే అగ్రస్థానంలో ఉండేవాడిని.'అని మహమ్మద్ షమీ చెప్పుకొచ్చాడు. షమీ కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే గాయాల బారిన పడి జట్టుకు దూరమయ్యేవాడు. వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో షమీ ఇంజెక్షన్స్ సాయంతో బౌలింగ్ చేసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
