Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్.. కరోనా నుంచి కోలుకున్న షమీ! కానీ..

 Mohammed Shami has tested negative for COVID-19, to undergo cardiovascular test this week

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ ముందు టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్. కరోనా వైరస్ బారిన పడిన టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ కోలుకున్నాడు. తాజాగా అతనికి నిర్వహించిన పరీక్షల్లో నెగటీవ్ వచ్చింది. ఈ విషయాన్ని అతనే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఇక ఆసియాకప్ 2022‌లో టీమిండియా వైఫల్యంతో మహహ్మద్ షమీని జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ వినిపించింది. పేలవ బౌలింగ్ కారణంగానే టీమిండియా ఫైనల్ చేరకుండా ఇంటిదారిపట్టిందని మండిపడిన అభిమానులు షమీని తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు.

చివరి నిమిషంలో కరోనా..

చివరి నిమిషంలో కరోనా..

దాంతో మళ్లీ షమీని టీ20లకు పరిగణలోకి తీసుకున్న భారత సెలెక్టర్లు.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో సిరీస్‌లకు ఎంపికచేయడంతో పాటు జస్‌ప్రీత్ బుమ్రాకు బ్యాకప్‌గా వరల్డ్ కప్ జట్టులోకి స్టాండ్‌బై ప్లేయర్‌గా తీసుకున్నారు. దాంతో షమీ రీఎంట్రీ ఖాయమని అంతా భావించారు. అయితే ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ముందు షమీ కరోనా బారిన పడ్డాడు. దాంతో ఈ సిరీస్‌తో పాటు సౌతాఫ్రికాతో నేటి నుంచి ప్రారంభంకానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. అతని స్థానంలో జట్టులోకి ఉమేశ్ యాదవ్ రాగా.. అతను పెద్దగా రాణించలేదు. దాంతో జమ్ముకశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్‌ను తీసుకోవాలని సెలెక్టర్లు భావించారు.

ఆ టెస్ట్ పాసైతే..

ఆ టెస్ట్ పాసైతే..

కానీ షమీ కరోనా నుంచి కోలుకోవడంతో అతన్నే టీ20 ప్రపంచకప్ జట్టుతో కొనసాగించే అవకాశం ఉంది. అయితే కరోనా నుంచి కోలుకున్న షమీకి కార్డియోవాస్కులర్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ టెస్ట్‌లో సానుకూల ఫలితం వస్తేనే షమీ ప్రపంచకప్ జట్టుతో ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కనున్నాడు. ఈ టెస్ట్‌లో నెగటీవ్ వస్తే అతను 100 శాతం ఫిట్‌గా లేడని భావిస్తారు. కాబట్టి ఈ టెస్ట్‌పైనే షమీ భవితవ్యం ఆధారపడి ఉంది.

వెయిట్ చేస్తున్న సెలెక్టర్లు..

వెయిట్ చేస్తున్న సెలెక్టర్లు..

ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రపంచకప్ బరిలోకి దిగే జట్లు.. అక్టోబర్ 9లోపు మార్పులు చేర్పూలు చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 15వరకు మరో అవకాశం ఉంది. అయితే ప్రపంచకప్ ముందు ఒక్క మ్యాచ్ ఆడని షమీని స్టాండ్‌బై ప్లేయర్‌గా కొనసాగించడం కరెక్టేనా? అనే డైలామాలో సెలెక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అతను ఫిట్‌గా ఉండి వార్మప్ మ్యాచ్ ఆడగలగాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. జట్టులో మార్పులు గురించి కొన్నాళ్లు వేచి చూడాలనుకుంటున్నారు. దీపక్ హుడా గాయంపై కూడా రిపోర్ట్ అందితే జట్టు మార్పులపై తమకు క్లారిటీ వస్తుందని ఓ బీసీసీఐ అధికారి ఇన్‌సైడ్ స్పోర్ట్ వెబ్‌సైట్‌కు తెలిపారు.

షమీ కీలకం.

షమీ కీలకం.

షమీ ప్రపంచకప్ జట్టులో ఉండటం చాలా కీలకమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయాల నుంచి కోలుకొని వచ్చారని, వారు తమ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నారని చెబుతున్నారు. ముందు జాగ్రత్తగా షమీ వంటి సీనియర్ పేసర్‌ను బ్యాకప్‌గా ఉంచుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్న బుమ్రా.. మెగా టోర్నీలో గాయపడితే ఇబ్బంది అవుతుందని, షమీని స్టాండ్‌బై ఉంచాలని సూచిస్తున్నారు.

Story first published: Wednesday, September 28, 2022, 16:19 [IST]
Other articles published on Sep 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+