Mohammed Shami సంచలన ప్రదర్శనపై అతని మాజీ భార్య షాకింగ్ కామెంట్స్!
World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ దుమ్మురేపుతున్నాడు. నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగా తొలి నాలుగు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న షమీ.. హార్దిక్ పాండ్యా గాయంతో దూరమవడంతో తుది జట్టులోకి వచ్చాడు.
న్యూజిలాండ్‌తో ఆడిన తన తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లతో సత్తా చాటి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. అదే జోరును కొనసాగిస్తూ ఇంగ్లండ్‌పై 4 వికెట్లు, శ్రీలంకపై ఐదు వికెట్లు తీసి వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. మెగాటోర్నీలో అత్యధికసార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న ఆటగాడిగా మిచెల్ స్టార్క్‌తో సమంగా నిలిచాడు.

సౌతాఫ్రికాతో జరిగిన గత మ్యాచ్‌లోనూ రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. 5 మ్యాచ్‌ల్లో 16 వికెట్లతో టాప్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. మహమ్మద్ షమీ సంచలన ప్రదర్శనపై అతని మాజీ భార్య హసీన్ జహాన్ విచిత్రకర వ్యాఖ్యలు చేసింది. ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెను ప్రపంచకప్‌లో షమీ, టీమిండియా సక్సెస్ గురించి ప్రశ్నించగా.. విచిత్రకర రీతిలో బదులిచ్చింది.
ముందుగా తనకు క్రికెట్, క్రికెటర్లన్నా పెద్దగా ఆసక్తి ఉండదని చెప్పిన హసీన్ జహాన్.. షమీ బాగా ఆడితే.. టీమిండియాలో ఎక్కువ రోజులు ఉంటాడని, తద్వారా డబ్బులు బాగా వస్తాయని పేర్కొంది. అది తమ కుటుంబ భవిష్యత్తుకు ఉపయోగపడుతాయని తెలిపింది. 'ఏది ఏమైనా షమీ బాగా ఆడితే టీమిండియాలో ఎక్కువ రోజులు కొనసాగుతాడు.
అప్పుడు అతను మరింత ఎక్కువగా సంపాదిస్తాడు. ఆ డబ్బు మా భవిష్యత్తుకు భద్రత ఇస్తుంది.'అని హసీన్ జహాన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ ఏడాది ఆరంభంలో హసీన్ జహాన్‌కు నెలకు రూ. లక్షా 30 వేలు భరణం కింద చెల్లించాలని మహమ్మద్ షమీకి కోర్టు ఆదేశించింది. 2014, జూన్ 6న ఛీర్ గర్ల్ అయిన హసీన్ జహాన్‌ను మహమ్మద్ షమీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2015లో వీరికి ఓ పాప జన్మించింది. 2018, మార్చి 8న మహమ్మద్ షమీపై హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేయడంతో పాటు గృహ హింస కేసు పెట్టింది. అప్పటి నుంచి ఈ ఇద్దరూ వేరుగా ఉంటున్నారు.
హసీన్ జహాన్ కారణంగా షమీ.. తీవ్ర మానసిక క్షోభను అనుభవించాడు. ఈ విషయాన్ని అతనే వెల్లడించాడు. డిప్రెషన్ కారణంగా రెండు, మూడు సార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించినట్లు పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications