Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs LSG: గంభీర్, అగార్కర్.. బంగారం లాంటి పేసర్‌ను పక్కనపెట్టారు!

ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పేసర్ మహ్మద్ షమీ నిప్పులు చెరిగాడు. తన పాత జట్టు అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కనికరం లేకుండా బంతితో విరుచుకుపడ్డాడు. అసాధారణ బౌలింగ్ ప్రదర్శన‌తో ఆకట్టుకున్నాడు.

సన్‌రైజర్స్ బ్యాటర్లకు చుక్కలు..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు షమీ ఆదిలోనే షాక్ ఇచ్చాడు. పవర్‌ప్లేలోనే అత్యంత ప్రమాదకరమైన అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లను పెవిలియన్ చేర్చాడు. షమీ వేసిన కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ డెలివరీలకు సమాధానం చెప్పలేక సన్‌రైజర్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చిన షమీ.. 2 కీలక వికెట్లు తీసి ఆరెంజ్ ఆర్మీ పతనాన్ని శాసించాడు.

Shami Decimates SRH Top Order at Uppal Angry Fans Slam Agarkar and Gambhir Over Omission

టీమిండియా సెలెక్టర్లపై విమర్శలు..

షమీ స్పెల్ చూసిన నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా భారత సెలెక్టర్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్‌ల‌ను నిలదీస్తున్నారు. గతేడాదిగా షమీ మెరుగైన ప్రదర్శన చేసినా.. భారత జట్టుకు ఎందుకు దూరం పెట్టారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన షమీని, ఆ తర్వాత వన్డేలకు ఎంపిక చేయకపోవడాన్ని తప్పుబడుతూ'ఎక్స్' వేదికగా మండిపడుతున్నారు. రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున 37 వికెట్లు తీసి సూపర్ ఫామ్‌లో కనబర్చినా సెలెక్టర్లు పట్టించుకోలేదు. దాంతోనే షమీకి సెలెక్టర్లు అన్యాయం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. బంగారం లాంటి పేసర్‌ను పక్కనపెట్టారని గంభీర్, అగార్కర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

కోచ్ అసహనం..

మహమ్మద్ షమీ వ్యక్తిగత కోచ్ మొహమ్మద్ బద్రుద్దీన్ సెలెక్టర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా టుడేతో మాట్లాడుతూ ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 'ఒక ఆటగాడు ఇంకా ఏమి చేయాలి? దేశవాళీలో అన్ని వికెట్లు తీసినా.. ఐపీఎల్‌లో సత్తా చాటుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? దీనిని బట్టి చూస్తే సెలెక్టర్లు అతన్ని వన్డే ఫార్మాట్ నుంచి శాశ్వతంగా దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఇది భారత క్రికెట్‌కు తీరని లోటు.'అని ఆయన ఆవేదనకు లోనయ్యారు.

Story first published: Sunday, April 5, 2026, 18:40 [IST]
Other articles published on Apr 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+