ఎంత ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మన్‌కు అయినా ఒక్క మంచి బంతి చాలు: షమీ

సిడ్నీ: ఎంత ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మన్ అయినా ఒక్క మంచి బంతికి ఔటవుతాడని టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తెలిపాడు. ఆస్ట్రేలియాతో గతేడాది ప్రదర్శనను పునరావృతం చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాలో సత్తాచాటాలంటే గంటకు 140 కిమీ వేగంతో బంతులు సంధించే పేస్ అవసరమని ఈ భారత పేసర్ చెప్పుకొచ్చాడు. గత ఆసీస్ పర్యటనలో కోహ్లీ సేన 2-1తో టెస్టు సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

షమీ ధీమా..
ఈ సిరీస్‌లో భారత బౌలర్లు చెలరేగారు. ఏకంగా 70 వికెట్లు పడగొట్టారు. పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా (21 వికెట్లు), షమీ (16), ఇషాంత్‌శర్మ (11) విజృంభించారు. అయితే అప్పుడు ఆసీస్ స్టార్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ జట్టులో లేరు. కానీ ఇప్పుడు వారు అందుబాటులో ఉండటంతో ఆసీస్ నుంచి భారత్‌కు గట్టి సవాల్ ఎదురుకానుంది. అయితే తమ ఫాస్ట్ బౌలర్లు గత ప్రదర్శనను పునరావృతం చేస్తారని షమీ ధీమా వ్యక్తం చేశాడు.

పటిష్టమైన బౌలింగ్..
‘టీమిండియా ఫాస్ట్ బౌలర్ల బృందం నిలకడగా గంటకు 140 కిమీ వేగంతో బంతులు సంధించగలదు. ఆసీస్‌లో సత్తాచాటాలంటే అలాంటి పేస్ అవసరం. రిజర్వ్ బెంచ్‌లో ఉన్నవాళ్లు కూడా ఫాస్ట్ బౌలర్లే. మాలాంటి బౌలింగ్ విభాగం మరెక్కడా లేదు. ఎలాంటి సవాల్‌నైనా అధిగమించగలం. మాకు అనుభవం ఉంది. మా స్పిన్ బౌలింగ్‌లో వైవిధ్యం ఉంది. వేగంగా బౌలింగ్ చేయగలం. కాని మేమంతా భిన్నమైన బౌలర్లం. మా నైపుణ్యాలు విభిన్నం.

మా విజయ రహస్యం అదే..
టీమిండియాలో నాణ్యమైన బ్యాట్స్‌మెన్ ఉన్నారు. వారికి నెట్స్‌లో బౌలింగ్ చేస్తాం. పేర్లను చూడం. నైపుణ్యాలపైనే దృష్టిసారిస్తాం. ఎంత ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మన్ అయినా ఒక్క మంచి బంతి ఔట్ చేస్తుంది. సమష్టిగా రాణించడమే టీమిండియా పేసర్ల విజయ రహస్యం. మ్యాచ్‌లో మా అందరి లక్ష్యం ఒక్కటే ఉంటుంది.
అందరం కలిసే ఆ లక్ష్యాన్ని అందుకునేందుకు ప్రయత్నిస్తాం. మా మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉందే తప్ప ఎలాంటి వైరం లేదు. విదేశాల్లో దాదాపు ప్రతి మ్యాచ్‌లో 20 వికెట్లు పడగొట్టాం. సొంతగడ్డపై జరిగిన గులాబీ బంతి టెస్టులోనూ ఫాస్ట్ బౌలర్లు ప్రభావం చూపారు'' అని షమీ గుర్తు చేశాడు.
ఇక నవంబర్ 27 జరిగే ఫస్ట్ వన్డేతో టీమిండియా ఆసీస్ టూర్ మొదలవ్వనుంది. రెండు నెలల పాటు సాగే ఈ సుదీర్ఘ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్ట్‌లు ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications