
కోహ్లీ.. బౌలర్ల కెప్టెన్..
‘కోహ్లీకి ఉన్న మంచి లక్షణం ఎనర్జీనే. దాంతో జట్టు సభ్యుల్లో స్ఫూర్తి నింపుతాడు. అతనెప్పుడూ బౌలర్ల కెప్టెన్. మేం అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి స్వేచ్ఛనిచ్చాడు. ఎప్పుడూ మాతో చర్చించి మా అభిప్రాయాలకు విలువనిస్తాడు. అతనితో మేమెంతో కాలం కలిసి ఉన్నాం. దాంతో మా మధ్య మంచి జ్ఞాపకాలు మిగిలిపోయాయి. అవి ఏప్పటికీ నా హృదయంలో నిలిచిపోతాయి. అందులో ఏది ప్రత్యేకమని అడిగితే చెప్పలేను' అని షమీ చెప్పుకొచ్చాడు.

పరుగులు చేస్తున్నాడు కదా..
ఇక కోహ్లీ బ్యాటింగ్‌పై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘కోహ్లీ సెంచరీ చేయకపోతే ఏమైంది? ఒక్క శతకమే అతను ఎంతో పెద్ద ప్లేయరో నిర్వచించలేదు. అయినా అతను పరుగులు చేయకుండా ఉండటం లేదు కదా. సెంచరీలు చేయకున్నా నిలకడగా హాఫ్ సెంచరీలు బాదుతున్నాడు. అతను చేసే 50, 60 పరుగులైనా జట్టుకు ఉపయోగపడుతున్నాయి కదా?'అని షమీ విరాట్‌కు అండగా నిలిచాడు.

షమీకి అండగా కోహ్లీ..
కాగా, గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలయ్యాక పలువురు నెటిజన్లు షమీపై వ్యక్తిగతంగా దాడి చేసిన విషయం తెలిసిందే. మత వివక్ష చాటుతూ అతనిపై తమ అక్కసును వెల్లగక్కారు. షమీ పరోక్షంగా పాకిస్థాన్ గెలుపునకు సహకరించాడని మండిపడ్డారు. అయితే ఈ ట్రోలింగ్‌ను విరాట్ కోహ్లీ తప్పుబట్టాడు. వెన్నుముక లేని వెదవలు కూసే పిచ్చి కూతలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. విరాట్ ఇలా బహిరంగంగా షమీకి అండగా నిలవడం బీసీసీఐ పెద్దలకు నచ్చలేదని, ఆ క్రమంలోనే అతని కెప్టెన్సీపై వేటు పడిందనే ప్రచారం కూడా ఉంది.

టెస్ట్ కెప్టెన్సీకి రెడీ..
కెప్టెన్సీ చేసే అవకాశం వస్తే తప్పక స్వీకరిస్తానని మహమ్మద్ షమీ తన మనసులో మాటను బయటపెట్టాడు. ‘‘అన్ని ఫార్మాట్ల సిరీస్‌ల సెలక్షన్‌కు నేను అందుబాటులో ఉంటాను. నన్ను నేను నిరూపించుకోవాలని భావిస్తున్నాను. ఇక కెప్టెన్సీ విషయం గురించి ప్రస్తుతం నేను ఆలోచించడం లేదు.
అయితే, నాకు ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాను. నిజాయితీగా చెప్పాలంటే... టీమిండియాకు సారథ్యం వహించే అవకాశం వస్తే ఎవరు మాత్రం ఎందుకు వదులుకుంటారు? మరోసారి చెబుతున్నా... నాకు ఏ పని అప్పజెప్పినా కచ్చితంగా వందశాతం న్యాయం చేస్తా'' అని షమీ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications












