Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సంజయ్ మంజ్రేకర్.. కాస్త నీ అతి తెలివిని దాచుకో.. మహమ్మద్ షమీ ఫైర్!

టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌పై స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతి తెలివిని దాచుకోవాలని మండిపడ్డాడు. సంజయ్ మంజ్రేకర్ బాబాజీ అవతారమెత్తాడని, జాతకాలు కావాలంటే అతన్ని కలవాలని జనాలకు తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సెటైర్లు పేల్చాడు.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో మహమ్మద్ షమీ తక్కువ ధర పలుకుతాడని ఇటీవల సంజయ్ మంజ్రేకర్ జోస్యం చెప్పాడు. గాయంతో ఏడాది పాటు జట్టుకు దూరమైన షమీని తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి కనబర్చినా..ఎక్కువ ధర పెట్టకపోవచ్చన్నాడు. ఒకవేళ భారీ ధరతో కొనుగోలు చేస్తే తీవ్రంగా నష్టపోతారని తెలిపాడు. సీజన్ మధ్యలోనే షమీ దూరమైతే సదరు ఫ్రాంచైజీకి కష్టాలు తప్పవన్నాడు.

Mohammed Shami Blasts Sanjay Manjrekar For Drop In IPL Salary Prediction Save the knowledge for your future Sanjay

సౌదీ అరేబియాలోని జడ్డా వేదికగా ఆది, సోమ(నవంబర్ 24, 25) తేదీల్లో ఐపీఎల్ 2025 మెగా వేలం జరగనుంది. ఈ సారి మెగా వేలంలో 10 ఫ్రాంచైజీల్లోని 204 స్థానాల కోసం 574 మంది పోటీ పడుతున్నారు. ఇందులో 366 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 208 మంది ఓవర్‌సీస్ ప్లేయర్లు ఉన్నారు.

మరో ముగ్గురు అసోసియేట్ నేషన్స్‌కు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. భారత్‌కు చెందిన 318 మంది అనామక ఆటగాళ్లు ఈ జాబితాలో చోటు దక్కించుకోగా.. 12 మంది అన్‌క్యాప్‌డ్ ఓవర్‌సీస్ ప్లేయర్లు ఉన్నారు. 70 ఓవర్‌సీస్ స్లాట్స్‌ అందుబాటులో ఉన్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ మెగా వేలం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. గత సీజన్‌ వరకు గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన షమీని ఆ జట్టు వేలంలోకి వదిలేసింది.

ఈ మెగా వేలం నేపథ్యంలోనే అధికారిక బ్రాడ్ కాస్టర్‌ స్టార్స్ స్పోర్ట్స్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. మంజ్రేకర్ షమీ తక్కువ ధర పలుకుతాడని అంచనా వేసాడు. 'షమీని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరుస్తాయి. కానీ అతని గాయం చరిత్ర, కోలుకోవడానికి తీసుకున్న సమయాన్ని పరిగణలోకి తీసుకోనున్నాయి. ఒకవేళ ఏదైనా ఫ్రాంచైజీ భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన తర్వాత సగం సీజన్‌లో అందుబాటులో లేకుండా పోతే.. జట్టు ఆప్షన్స్ తగ్గుతాయి. ఈ విషయమే అతని ధరను తగ్గించవచ్చు.'అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.

ఈ వ్యాఖ్యలకు చిర్రెత్తుకుపోయిన షమీ.. సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించాడు.'బాబాకీ జై.. నీ అతి తెలివిని కాస్త దాచుకో సంజయ్. ఎవరికైనా జాతకం కావాలంటే సంజయ్ మంజ్రేకర్‌ను కలవండి'అని షమీ రాసుకొచ్చాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న షమీ.. రంజీట్రోఫీలో బెంగాల్ తరఫున బరిలోకి దిగి సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు సమాయాత్తమవుతున్నాడు.

Story first published: Thursday, November 21, 2024, 12:03 [IST]
Other articles published on Nov 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+