మహమ్మద్ షమీ జాతక చక్రం ఎలా ఉందంటే? రీఎంట్రీ సాధ్యమేనా..?
పిచ్ ఏదైనా.. కండిషన్స్ ఎలా ఉన్నా.. బంతి అతని చేతికి వచ్చిందంటే వికెట్ల పండగ చేసుకోవాల్సిందే! తీవ్రమైన గాయాలు వేధించినా.. చేసుకున్నామెతో చెడి ఇంట్లో మనశ్శాంతి కరువైనా.. అతని ఆట మాత్రం మారలేదు! పదునైన రివర్స్ స్వింగ్.. కచ్చితమైన సీమ్ పొజిషన్‌కు మారుపేరు అతను!
అడ్డంకులు ఎన్ని వచ్చినా.. పునరాగమనంలో తనకు తానే సాటి అని ప్రతిసారి నిరూపించుకున్న రియల్ కంబ్యాక్ కింగ్ అతను! తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్ల గుండెల్లో గుబులు పుట్టించిన ధీరుడు! అతనెవరో కాదు టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ. ఉత్తరప్రదేశ్ లోని ఒక చిన్న గ్రామం నుంచి వరల్డ్ బెస్ట్ బౌలర్‌గా ఎదిగిన షమీ నేడు 36వ జన్మదినం జరుపుకుంటున్నాడు.
ఈ సందర్భంగా అతని జాతక చక్రం ఎలా ఉందో తెలుసుకుందాం. గత ఏడాదిన్నరగా టీమిండియాకు దూరంగా ఉన్న షమీ.. మళ్లీ భారత జట్టులోకి పునరాగమనం చేస్తాడా? అతని గ్రహ బలాలు ఏం చెబుతున్నాయో ఓ లుక్కెద్దాం.

మారు పల్లె నుంచి..
ఉత్తర్ ప్రదేశ్‌లోని అమోరాలో 1990, సెప్టెంబర్ 3న మహమ్మద్ షమీ జన్మించాడు. పాశ్చాత్య జ్యోతిష్యం ప్రకారం షమీది కన్యా రాశి కాగా.. వైదిక జ్యోతిష్యం ప్రకారం అతనిది మకర రాశి, శ్రవణా నక్షత్రం. బుధుడి ఆధిపత్యం ఉన్న కన్యా రాశిలోని స్థానాలు అతనికి మైదానంలో కష్టపడే తత్వాన్ని ఇచ్చాయి. బుధ, సూర్య గ్రహాల ప్రాబల్యాల కారణంగా అతనికి కచ్చితమైన సీమ్ పొజిషన్, కంట్రోల్‌తో బౌలింగ్ చేసే సామర్థ్యం వచ్చింది.
కుజుడు, శని ప్రభావం..
షమీ జాతకంలో కుజ, శని గ్రహాల కలయిక అతన్ని వరల్డ్ బెస్ట్ పేసర్‌గా తీర్చిదిద్దాయి. కుజుడు ఇచ్చే దూకుడు, ధైర్యం మైదానంలో బ్యాటర్లను ఇబ్బంది పెడితే.. మకర రాశిలోని శని స్థానం అతనికి అపారమైన సహనాన్ని, గాయాల నుంచి త్వరగా కోలుకునే మానసిక శక్తిని ప్రసాధించింది. వ్యక్తిగత, ఆటపరమైన ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ.. తిరిగి అంతే వేగంతో అతను పుంజుకోవడానికి ఈ శని గ్రహ ప్రభావమే ప్రధాన కారణం.
పట్టుదలకు, కష్టపడే తత్వానికి మారుపేరైన షమీ జాతకంలో గురు గ్రహ అనుగ్రహం కూడా ఉండటంతో ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నీల్లో భారత్‌ను విజేతగా నిలిపే అత్యుత్తమ ప్రదర్శనలను కనబర్చాడు. భవిష్యత్తులో కూడా అతని క్రీడా ప్రయాణం.. భారత క్రికెట్‌కు ఎంతో ఉపయోగపడనుంది. అతను కోచ్‌గా భారత జట్టుకు సేవలందించే అవకాశం కూడా ఉంది.
పునరాగమనం కష్టమే..
మహమ్మద్ షమీ పూర్తి ఫిట్‌నెస్ సాధించినా అతను తిరిగి టీమిండియాలోకి పునరాగమనం చేయడం కష్టమని అతని జాతకం చెబుతోంది. అతని అనుభవం మాత్రం భవిష్యత్తులో జట్టుకు ఉపయోగపడనుందని, కోచ్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అతని జాతకంలోని గ్రహాలు సూచిస్తున్నాయి. ఆర్థిక పరంగా మాత్రం షమీ జాతకం చాలా బలంగా ఉంది. కొత్త ప్రకటనలు, పెట్టుబడుల ద్వారా ఆదాయం మరింత పెరుగనుంది.
డిస్క్లేమర్: ఈ కథనంలో చెప్పిన మహమ్మద్ షమీ జాతకం, జ్యోతిష్య వివరాలు ఇంటర్నెట్‌లో లభించిన సమాచారంతో రాసాం. ఈ జాతకానికి మైఖేల్ తెలుగు వెబ్‌సైట్‌కు ఎలాంటి సంబంధం లేదు. కేవలం పాఠకుల ఆసక్తి, సమాచారం కోసం మాత్రమే రాయడం జరిగింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

