For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఇద్దరు లేకుంటే టీమిండియా ఓడిపోయేది: మహమ్మద్ కైఫ్

సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల అద్భుత ప్రదర్శనతోనే తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించిందని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అన్నాడు. కోహ్లీ, రోహిత్‌లు విఫలమై ఉంటే టీమిండియా ఓటమిపాలయ్యేదని తెలిపాడు. సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆదిలోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ వికెట్‌ను కోల్పోగా.. కోహ్లీ-రోహిత్ అద్భుతమైన భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. రెండో వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. కోహ్లీ సెంచరీతో రాణించగా.. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ ఇద్దరి అద్భుతమైన బ్యాటింగ్‌తో టీమిండియా 349 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.

అనంతరం సౌతాఫ్రికా బ్యాటర్లు విజయం కోసం ఆఖరి వరకు పోరాడారు. కానీ కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా అద్భుత బౌలింగ్‌తో జట్టుకు విజయాన్నందించారు. ఈ మ్యాచ్‌పై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన మహమ్మద్ కైఫ్.. కోహ్లీ, రోహిత్ లేకుంటే టీమిండియా ఓటమిపాలయ్యేదని తెలిపాడు.

Mohammed Kaif Says You Will Lose The Match If Virat Kohli And Rohit Sharma Get Out

'విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ త్వరగా ఔటై ఉంటే తొలి వన్డేలో టీమిండియా ఓటమిపాలయ్యేది. కోహ్లీ, రోహిత్ రాణించకుంటే టీమిండియా భారీ స్కోర్ చేసేది కాదు. 300, 350 రన్స్ చేయకుండా సౌతాఫ్రికా ఈజీగా భారత్‌ను ఓడిస్తుంది. ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా రోహిత్, విరాట్ కోహ్లీదే.

యువ ఆటగాళ్లు, కుర్రాళ్లను జట్టులోకి తీసుకురావడం గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ వారు కనీసం 200 పరుగులు కూడా చేయలేరు. కాబట్టి జట్టుకు విజయాలు కావాలంటే కోహ్లీ, రోహిత్‌లను జట్టులో కొనసాగించాల్సిందే. విరాట్ కోహ్లీ సెంచరీతో ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతను ఏడు సిక్సర్లు కొట్టగా.. రోహిత్ శర్మ మూడు సిక్సర్లు బాదాడు. వారు ఒక కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ సిరీస్‌కు ముందు సిడ్నీలోనూ వారు ఇదే తరహాలో రాణించారు.

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ పరాజయం అనంతరం భారత జట్టు పరిస్థితి దారుణంగా తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విజయం ఉపశమనం కలిగించింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు కోహ్లీ, రోహిత్ అవసరం జట్టుకు ఉంది. కోహ్లీకి 37, రోహిత్‌కి 38 ఏళ్ల వయసు. అయినా వారు అద్భుతంగా ఆడారు. వారు గనుక పరుగులు చేయకపోయి ఉంటే సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌ను చాలా సునాయసంగా గెలిచేది.'అని మహమ్మద్ కైఫ్ పేర్కొన్నారు.

Story first published: Monday, December 1, 2025, 17:08 [IST]
Other articles published on Dec 1, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+