Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రిషభ్ పంత్ గాశారం బాలేదు.. కానీ టెస్ట్‌ల్లో తిరుగులేదు: మహమ్మద్ కైఫ్

పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అండగా నిలిచాడు. ప్రస్తుతం రిషభ్ పంత్ గడ్డు కాలం ఎదుర్కొంటున్నాడని, భారత టీ20, వన్డే జట్లలో చోటు కోల్పోయాడని తెలిపాడు. కానీ టెస్ట్‌ల్లో రిషభ్ పంత్‌కు తిరుగులేదని, శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో పంత్ రాణిస్తాడని కైఫ్ విశ్వాసం వ్యక్తం చేశాడు.

ఇదేం క్రికెట్ రా బాబూ!.. బంతిని కాళ్లతో బాదిన పంత్! (వీడియో)

ఇదేం క్రికెట్ రా బాబూ!.. బంతిని కాళ్లతో బాదిన పంత్! (వీడియో)

రెండేళ్ల క్రితం భారత్ తరఫున చివరి అంతర్జాతీయ వైట్ బాల్ మ్యాచ్ ఆడిన రిషభ్ పంత్.. వరుసగా రెండు ఐపీఎల్ సీజన్లలో దారుణంగా విఫలమయ్యాడు. రూ.27 కోట్ల భారీ క్యాష్ ప్రైజ్ ట్యాగ్ రిషభ్ పంత్‌పై అనవసర ఒత్తిడిని తీసుకొచ్చింది. రిషభ్ పంత్ వైఫల్యంతో లక్నో సూపర్ జెయింట్స్ రెండు సీజన్లలో పేలవ ప్రదర్శన కనబర్చింది. దాంతో ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి రిషభ్ పంత్ తప్పుకున్నాడు. వైట్ బాల్ క్రికెట్‌లో విఫలమైనా రెడ్ బాల్ క్రికెట్‌లో పర్వాలేదనిపించాడు.

Mohammed Kaif Says Rishabh Pant Needs Team Support Amid Recent Troubles

టెస్ట్‌ల్లో గొప్ప ఆటగాడే..

శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ముందు రిషభ్ పంత్ గురించి మాట్లాడిన కైఫ్.. ఇప్పటికీ సుదీర్ఘ ఫార్మాట్‌లో అతను గొప్ప ఆటగాడేనని అభిప్రాయపడ్డాడు. అయితే తనపై నిరంతరం ప్రతికూల వార్తలు వస్తుండటం వల్ల 28 ఏళ్ల రిషభ్ పంత్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని తెలిపాడు. అతనికి జట్టు మద్దతుగా నిలవాలని కోరాడు.'రిషభ్ పంత్‌ను ఇతర ఫార్మాట్లకు పరిగణనలోకి తీసుకోవడం లేదు. అతను వన్డేలు ఆడి చాలా రోజులు అయ్యింది. టీ20ల్లో అతని పేరును కూడా పరిశీలించడం లేదు.

ఐపీఎల్‌లో కూడా అతను గడ్డు కాలం ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం అతని గాశారం ఏ మాత్రం బాలేదు. కానీ టెస్ట్ క్రికెట్‌లో నేను అతన్ని కొంచెం భిన్నంగా చూస్తాను. టెస్ట్ మ్యాచ్‌ల్లో అతను ఏం చేయగలడో పరిగణనలోకి తీసుకొని మద్దతు ఇస్తాను. భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన పంత్.. అప్‌కమింగ్ రెండు టెస్ట్‌ల సిరీస్‌లో ఎలా రాణిస్తాడో చూడాలనుకుంటున్నా.

గంభీర్, లక్ష్మణ్ మధ్య ఉన్న తేడా అదే: మహమ్మద్ కైఫ్

Also Read

గంభీర్, లక్ష్మణ్ మధ్య ఉన్న తేడా అదే: మహమ్మద్ కైఫ్

ఐపీఎల్ వైఫల్యంతో...

అతనిపై చాలా ఒత్తిడి ఉందని తెలుసు. మీడియాలో అతని పేరును సాకూలంగా ప్రస్తావించడం లేదు. అతని గురించి ప్రతికూల చర్చలే జరుగుతున్నాయి. అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డ్ సాధించిన విషయాన్ని పక్కన పెడితే.. అతని జట్టు దారుణంగా విఫలమై పాయింట్ల పట్టికలో వెనుకంజలో నిలిచింది. దాంతో జనాలు పంత్ గురించి ప్రతికూల చర్చలు చేశారు. కానీ టెస్ట్‌ క్రికెట్‌లో అతను ఎప్పటికీ గొప్ప ఆటగాడే.'అని కైఫ్ చెప్పుకొచ్చాడు. భారత్ తరఫున ఇప్పటి వరకు 50 టెస్ట్‌లు ఆడిన రిషభ్ పంత్ 43.37 సగటుతో 3557 పరుగులు చేశాడు. ఇందులో 19 హాఫ్ సెంచరీలతో పాటు 8 శతకాలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోర్ 159 నాటౌట్.

Story first published: Tuesday, August 11, 2026, 18:07 [IST]
Other articles published on Aug 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+