ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ప్రదర్శనతో డీలా పడిన భారత జట్టుకు మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అండగా నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. తాజా పరాజయాన్ని అందరూ మరిచిపోతారని తెలిపాడు. అయితే జట్టులోని ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సలహా ఇచ్చాడు.
ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 1-3తో ఆసీస్‌కు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘోర పరాజయంతో టీమిండియాపై సర్వత్రా విమర్శలు వ్యక్తవమవుతున్నాయి. ఈ క్రమంలోనే టీమిండియా పరాజయంపై స్పందించిన కైఫ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో మెరుగైన ఫలితాలు సాధించకపోతే టీమిండియాను పరిమిత ఓవర్లు ఆడే క్రికెట్ జట్టుగా చూసే ప్రమాదం ఉందని హెచ్చరించాడు.

'ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై టీమిండియా విజయం సాధిస్తే ప్రశంసల జల్లు కురుస్తుంది. ఫిబ్రవరి 23న ఈ మ్యాచ్ జరగనుంది. ఈ విజయంతో తాజా పరాజయాన్ని అభిమానులు మరిచిపోతారు. అయితే భారత్ ఛాంపియన్‌షిప్ టోర్నీని గెలవాలంటే మాత్రం జట్టులోని ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. పేస్ ట్రాక్స్, స్పిన్ ట్రాక్‌లపై ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. డొమెస్టిక్ క్రికెట్ ఆడకుండా టెస్ట్‌ల్లో విజయాలు సాధించడం చాలా కష్టం.
ఆసీస్ పర్యటనలో భారత్‌కు ఎదురైన పరాజయాన్ని మేలుకొలుపుగా భావించాలి. సుదీర్ఘ ఫార్మాట్‌లో మెరుగ్గా రాణించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. గంభీర్ తప్పిదం వల్లే భారత్‌కు ఓటమి ఎదురవ్వలేదు. ఇది సమష్టి వైఫల్యం. ప్రతీ ఒక్క ఆటగాడు రంజీ ట్రోఫీలో ఆడేందుకు ప్రయత్నించాలి. అయితే విశ్రాంతి పేరుతో కొందరు ఆటగాళ్లు రంజీ క్రికెట్ ఆడటం లేదు.
రంజీ ఆడకుండా.. ప్రాక్టీస్ చేయకుండా అత్యుత్తమ ప్రదర్శన ఎలా వస్తుంది? భారత్‌లో టర్నింగ్ ట్రాక్‌లపై ఆడటం కష్టం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికాలో సీమ్ పిచ్‌లు ఉంటాయి. ప్రాక్టీస్ చేయకుండా ఈ కండిషన్స్‌లో రాణించడం కష్టం. టెస్ట్ క్రికెట్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.'అని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు మహమ్మద్ కైఫ్ సూచించాడు.