For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2021: ఓడిపోతే ప్రెస్‌మీట్‌కు హాజరవ్వరా? కోహ్లీ, శాస్త్రిపై అజారుద్దీన్ ఫైర్!

Mohammed Azharuddin criticize Virat Kohli And Ravi Shastri For Not Attending Press Conference After Defeat To New Zealand

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌ చేతిలో ఎదురైన ఘోర పరాజయం తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రెస్‌మీట్ రాకుండా ముఖం చాటేయాడాన్ని మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ తప్పుబట్టాడు. ఇద్దరిలో కనీసం ఒకరు మీడియా ముందుకు రావాల్సిందన్నాడు. ఇక ఆదివారం జరిగిన ఈ కీలక పోరులో టీమిండియా 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి సెమీస్ ఆశలను గల్లంతు చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశానికి కెప్టెన్ విరాట్ కోహ్లీకి బదులు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా హాజరయ్యాడు. అయితే ఇది పద్దతి కాదని అజారుద్దీన్ విమర్శించాడు.

 రవిశాస్త్రి అయినా రావాల్సింది..

రవిశాస్త్రి అయినా రావాల్సింది..

కోహ్లీకి బదులు హెడ్ కోచ్ రవిశాస్త్రి అయినా మీడియా సమావేశానికి హాజరు కావాల్సిందన్నాడు. ఓటమికి సిగ్గుపడాల్సిన అవసరం లేదని, క్రికెట్‌లో గెలుపు ఓటములు సహజమని ఏబీపీ న్యూస్‌తో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు. 'నా అభిప్రాయం ప్రకారం టీమిండియా కోచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరుకావాల్సింది. మీడియా ముందుకు రావడానికి విరాట్ కోహ్లీ సిద్దంగా లేకుంటే ఓకే కానీ, రవి భాయ్ వచ్చి ఉండాల్సింది. విజయాలు సాధించినప్పుడే మీడియా ముందుకు రావడం కాదు. ఓడినప్పుడు కూడా అదే విధంగా వచ్చి వైఫల్యాలకు గల కారణాలు చెప్పాలి.

 సిగ్గు పడాల్సిన పని లేదు..

సిగ్గు పడాల్సిన పని లేదు..

బుమ్రాను పంపించడం ఏ మాత్రం భావ్యం కాదు. కోచ్ లేదా కెప్టెన్ లేకుంటే సహాయక సిబ్బందిలో ఒకరు మీడియా ముందుకు రావాల్సింది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయినంత మాత్రానా సిగ్గుపడాల్సిన పనిలేదు. కానీ కెప్టెన్, కోచ్ టీమ్ ఓటమికి గల కారణాలను దేశానికి వివరించాల్సిన అవసరం ఉంది. వీటికి బుమ్రా ఎలా సమాధానం చెప్పగలడు. విజయాలు దక్కినప్పుడు ఎలా మీడియాను ఎదుర్కొంటారో.. ఓడినప్పుడు, కఠిన పరిస్థితుల్లోనూ అలానే సమాధానం చెప్పాలి'అని అజారుద్దీన్ పేర్కొన్నాడు.

అలసిపోయాం..

అలసిపోయాం..

మీడియా సమావేశానికి హాజరైన బుమ్రా.. టీ20 ప్రపంచకప్‌లో తమ వైఫల్యానికి తీరిక లేని షెడ్యూల్ కూడా ఓ కారణమని తెలిపాడు. బయో బబుల్స్‌తో మానసికంగా విసిగిపోతున్నామన్నాడు. 'ఆటగాళ్లకు కొన్నిసార్లు విశ్రాంతి అవసరం. కుటుంబానికి దూరంగా ఉంటుంటారు. ఆరు నెలలుగా విరామం లేకుండా ఆడుతున్నాం. ఇంత సుదీర్ఘ కాలం కుటుంబానికి దూరంగా, బయోబబుల్​లో ఉండటం వల్ల ఆటగాళ్ల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. మేమంతా సౌకర్యవంతంగా ఉండేందుకు బీసీసీఐ సాధ్యమైనంత మేర ప్రయత్నిస్తోంది. ఇది చాలా కష్టసమయం. మహమ్మారి ప్రభావం కొనసాగుతోంది. అందువల్ల ఈ బబుల్​కు అలవాటు పడటానికి ప్రయత్నిస్తున్నాం. మానసిక అలసట కూడా వేధిస్తోంది.'అని బుమ్రా చెప్పుకొచ్చాడు.

అద్భుతమే జరగాలి..

అద్భుతమే జరగాలి..

ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా సెమీస్‌కు చేరాలంటే అద్భుతమే జరగాలి. హ్యాట్రిక్ విక్టరీలతో గ్రూప్2 టాపర్ పాకిస్థాన్ సెమీస్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకోగా.. పాయింట్ల ఖాతానే తెరవని భారత్(-1.61 రన్‌రేట్) ఐదో ప్లేస్‌లో ఉంది. మిగిలిన మ్యాచ్‌ల్లో చిన్న జట్టు అఫ్గానిస్తాన్, స్కాట్లాండ్, నమీబియాపై గెలిచినా మనోళ్లు సెమీస్ చేరడం కష్టమే. ఎందుకంటే ఈ మూడు టీమ్స్‌తోనే తలపడనున్న న్యూజిలాండ్ రెండింటిలో ఓడాలి, అది అసాధ్యమే అనొచ్చు. ఒక మ్యాచ్‌లో ఓడినా ప్లస్ రన్‌రేట్(0.76)తో కివీస్ ముందంజ వేసే చాన్సుంది. కాబట్టి భారత్ సెమీస్ చేరడం చాలా కష్టం.

Story first published: Tuesday, November 2, 2021, 13:14 [IST]
Other articles published on Nov 2, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+