ఫొటో షూట్ సందర్భంగా..
ఆర్‌సీబీ ఫొటోషూట్ సందర్భంగా ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మహమ్మద్ సిరాజ్‌తో సోషల్ మీడియా టీమ్ చిట్ చాట్ చేసింది. ఫేవరేట్ ప్లేయర్స్ వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకుంది. ఆర్‌సీబీ బోల్డ్ డైరీస్ పేరిట ఈ వీడియోను ట్విటర్ వేదికగా పంచుకుంది.
ఈ క్రమంలోనే మహమ్మద్ సిరాజ్‌ను ఫేవరేట్ అథ్లేట్ ఎవరు? అని ప్రశ్నించగా.. క్రిస్టియన్ రొనాల్డో అని బదులిచ్చాడు. వెంటనే నువ్వే క్రిస్టియన్ రొనాల్డో అయితే ఏం చేస్తావు? అని ప్రశ్నించగా పేదల కోసం ఆసుపత్రి నిర్మిస్తానని వెల్లడించాడు.

ఆ బ్యాట్ బాల్...
కెరీర్ ఆరంభంలో మరిచిపోలేనే అనుభతి ఏమైనా ఉందా? అని ప్రశ్నిస్తే.. చిన్నప్పుడు తన తండ్రి బ్యాట్, బాల్ బహుమతిగా ఇవ్వడం ఎప్పటికీ మరిచిపోలేనని సిరాజ్ తెలిపాడు. చిన్నతనంలో బ్యాట్, బాల్ కొనడం తన కలని అది తన తండ్రి నేరవేర్చాడని చెప్పాడు. విరాట్ కోహ్లీ తనఫేవరేట్ అథ్లెట్ క్రిస్టియానో రొనాల్డోనే అని తెలపగా.. ఫాఫ్ డుప్లెసి తన ఫేవర్ అథ్లెట్ రోజర్ ఫెదరర్ అని చెప్పాడు. ఇక తాను రొనాల్డోను అయితే బ్రెయిన్‌ను స్కాన్ చేసి, ఇంత మెంటల్ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుంటానని కోహ్లీ తెలిపాడు. రోజర్ ఫెదరర్ అయితే ఏం చేస్తావని ఫాఫ్ అడగా వాచ్ చూసుకుంటానని చెప్పాడు.

ఆ రెండు మ్యాచ్‌లు..
ఐపీఎల్ 2016 ఫైనల్, టీ20 ప్రపంచకప్ 2016 సెమీఫైనల్ ఓటములతో తన గుండె పగిలిందని విరాట్ కోహ్లీ తెలిపాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో విరాట్ అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. 2016లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగులు చేయడం, గుజరాత్‌తో ఏబీడీ 79 పరుగులతో అజేయంగా నిలవడం బెస్ట్ ఐపీఎల్ మూమెంట్స్ అని తెలిపాడు. ఐపీఎల్ 2021 సీజన్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోవడం, 2018 క్వాలిఫయర్‌లో కేకేఆర్‌పై విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడటం తన బెస్ట్ మూమెంట్స్ అని ఫాఫ్ డుప్లెసిస్ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications












