టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ తమ్ముడు మహమ్మద్ కైఫ్ దుమ్మురేపాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటుతున్నాడు. దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ 2024లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ సోదరుడు.. ఉత్తర ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో తన జట్టుకు మూడు కీలక పాయింట్స్ అందించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఉత్తర ప్రదేశ్.. మహమ్మద్ కైఫ్(4/14) ధాటికి 60 పరుగులకే కుప్పకూలింది. షమీ తరహాలోనే యూపీ పతనాన్ని కైఫ్ శాసించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్.. భువన్వేశ్ కుమార్(8/41) సంచలన బౌలింగ్‌తో తొలి ఇన్నింగ్స్ 188 పరుగులకే కుప్పకూలింది.

బెంగాల్ జట్టులో మహమ్మద్ కైఫ్(79 బంతుల్లో 4 ఫోర్లతో సిక్స్‌తో 45 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కైఫ్.. 9వ వికెట్‌కు 52 పరుగులు జోడించాడు. ఆఖరి వికెట్‌కు 26 పరుగులు జోడించి యూపీపై 128 పరుగుల ఆధిక్యాన్ని అందించాడు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన యూపీ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 52 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. సమర్థ్ సింగ్(54) హాఫ్ సెంచరీతో రాణించగా.. నితీష్ రాణా(47 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రా అంగీకరించారు. దాంతో చివరి రోజు ఆట జరగలేదు.
టోర్నీ నిబంధనల ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన బెంగాల్‌కు మూడు కీలక పాయింట్లు లభించాయి. షమీ సోదరుడు మహమ్మద్ కైఫ్ 45 పరుగులు చేయకుంటే బెంగాల్‌కు ఈ పాయింట్స్ దక్కేవి కావు. దాంతో షమీ సోదరుడిపై సర్వాత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన కైఫ్.. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ 47 పరుగులతో అజేయంగా నిలవడంతో అతనికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇలానే కైఫ్ నిలకడగా ఆడితే అతి త్వరలోనే అతను అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.