Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేను 162 కిమీ వేగంతో బంతులేసా.. కానీ: పాక్ మాజీ పేసర్

Mohammad Sami says he bowled two deliveries in excess of 160 kph that weren’t recorded

కరాచీ: వరల్డ్ ఫాస్టెస్ట్ డెలివరీలను తాను రెండు సార్లు వేసానని పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ సమి తెలిపాడు. కానీ అప్పుడు బౌలింగ్ స్పీడ్‌గన్ పనిచేయకపోవడంతో అవి ప్రపంచానికి తెలియకుండా పోయాయన్నాడు. తాజాగా ఓ స్థానిక ఛానల్‌తో మాట్లాడిన అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహమ్మద్ సమి కొన్నాళ్ల పాటు దిగ్గజ పేసర్‌, స్పీడ్‌స్టర్‌ షోయబ్‌ అక్తర్‌తో కలిసి బౌలింగ్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అతను పాక్‌ జట్టులో కొద్దికాలం ప్రధాన బౌలర్లలో ఒకడిగా రాణించాడు.

'నేనొక మ్యాచ్‌లో రెండు బంతుల్ని 160 కి.మీ వేగానికిపైగా బౌలింగ్‌ చేశా. అందులో ఒకటి 162 కి.మీ వేగంతో పడింది. మరొకటి 164 కి.మీ వేగంతో దూసుకెళ్లింది. కానీ, అప్పుడు స్పీడ్‌గన్‌ (బౌలింగ్‌ వేగాన్ని కొలిచే మెషీన్‌) పనిచేయడంలేదని సిబ్బంది చెప్పడంతో ఆ బంతుల్ని లేక్కలోకి తీసుకోలేదు. అయితే, ప్రపంచ క్రికెట్‌లో 160 కి.మీ వేగంతో బంతులేసిన సందర్భాలు ఒకటో, రెండో మాత్రమే ఉంటాయి' అని సమి పేర్కొన్నాడు. కాగా, ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో అత్యధిక వేగం నమోదు చేసింది అక్తర్‌ మాత్రమే. అతడు 2002లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 161 కి.మీ వేగంతో ఒక బంతిని సంధించాడు.

ఆ రెండు బంతులను లెక్కించి ఉంటే వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్‌గా తాను రికార్డు సృష్టించేవాడినని చెప్పాడు. ఇక షోయబ్ అక్తర్ మాట్లాడుతూ అంతర్జాతీయ క్రికెట్‌లో 161.3 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతే ఫాస్టెస్ట్ డెలివరీ అని చెప్పాడు. 2002లో న్యూజిలాండ్‌లో ఈఘనతను అందుకున్నానని తెలిపాడు. ఆస్ట్రేలియా బౌలర్లు బ్రెట్ లీ, షాన్ టైట్ కూడా 160 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసారు. సమీ కూడా 160 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసినా వాటిని పరిగణలోకి తీసుకోలేదు.

పాకిస్థాన్ జట్టు తరఫున 36 టెస్ట్‌లు, 87 వన్డేలు, 13 టీ20లు ఆడిన సమీ.. అత్యధికంగా 156.4 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే 8 వికెట్లు తీసిన అతను.. శ్రీలంకపై హ్యాట్రిక్ సాధించాడు. వెస్టిండీస్‌తో వన్డేల్లో హ్యాట్రిక్ ఘనతను అందుకున్నాడు. టెస్ట్‌, వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన రెండో పాక్ బౌలర్‌గా సమి నిలిచాడు.

Story first published: Sunday, May 1, 2022, 16:18 [IST]
Other articles published on May 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+