For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK vs BAN: బాబర్ ఆజామ్‌ మీదకు బ్యాట్ విసిరేసిన మహమ్మద్ రిజ్వాన్..! (వీడియో)

పాకిస్థాన్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో 171 పరుగులతో అజేయంగా నిలిచిన మహమ్మద్ రిజ్వాన్.. ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడంతో కెరీర్‌లో ఫస్ట్ డబుల్ సెంచరీ సాధించలేకపోయాడు.

పాకిస్థాన్ కెప్టెన్ షాన్ మసూద్.. తమ తొలి ఇన్నింగ్స్‌ను 448/6 కు డిక్లేర్ చేశాడు. చివరి సెషన్‌లో బంగ్లాదేశ్‌ను కొన్ని ఓవర్లు ఆడించి వికెట్లు తీయాలనే ప్రణాళికలతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే డబుల్ సెంచరీకి ముంగిట డిక్లేర్ చేయడంపై రిజ్వాన్ అసంతృప్తికి గురయ్యాడు.

Mohammad Rizwan Throws Bat Towards Babar Azam After Declaration Denies Him 200 Video Goes Viral

మైదానాన్ని వీడే క్రమంలో స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్‌ మీదకు కోపంగా బ్యాట్ విసిరేసాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వైరల్ అయ్యింది. అయితే మహమ్మద్ రిజ్వాన్ విసిరేసిన బ్యాటర్‌ను బాబర్ ఆజామ్ క్యాచ్ అందుకోని అతనికి తిరిగిచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరూ నవ్వుకున్నారు.

1980 తర్వాత పాకిస్థాన్ తరఫున టెస్ట్‌ల్లో అజేయంగా 171 పరుగులు చేసిన బ్యాటర్‌గా రిజ్వాన్ నిలిచాడు. మహమ్మద్ రిజ్వాన్‌తో పాటు సౌద్ షకీల్(141) శతకాలతో రాణించగా.. సైమ్ ఆయుబ్(56) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 114 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును సౌద్ షకీల్, రిజ్వాన్ ఆదుకున్నారు.

ఐదో వికెట్‌కు 240 పరుగులు జోడించారు. రిజ్వాన్ డబుల్ సెంచరీ చేయకుండానే పాకిస్థాన్ డిక్లేర్ చేయడం విమర్శలకు దారి తీసింది. రిజ్వాన్ డబుల్ సెంచరీ చేసే వరకు ఇన్నింగ్స్‌ను కొనసాగించాల్సిందనే అభిప్రాయం వ్యక్తమైంది. మరోవైపు పాక్ కెప్టెన్ షాన్ మసూద్ మాత్రం.. రిజ్వాన్‌ను అడిగిన తర్వాతే డిక్లేర్ ఇచ్చానని తెలిపాడు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 218 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. క్రీజులో ముష్ఫికర్ రహీమ్(23 బ్యాటింగ్), లిటన్ దాస్(6 బ్యాటింగ్) ఉన్నారు. ఓపెనర్ షెడ్‌మన్ ఇస్లామ్(93), మోమినల్ హక్(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో ఖుర్రమ్ షెహ్‌జాద్ రెండు వికెట్లు తీయగా.. నసీమ్ షా, మహమ్మద్ అలీ, సయీమ్ ఆయుబ్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Friday, August 23, 2024, 17:42 [IST]
Other articles published on Aug 23, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+