For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాపం రిజ్వాన్.. అందుకు ఒప్పుకోలేదని వేటు వేసారు!

వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహమ్మద్ రిజ్వాన్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తప్పించింది. కొత్త వన్డే సారథిగా షాహిన్ షా అఫ్రిది నియమించింది. ఈ మేరకు పీసీబీ సోమవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇస్లామాబాద్‌లో సెలక్షన్ కమిటీ, హెడ్ కోచ్ మైక్ హెస్సన్‌తో జరిగిన సమావేశం తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

గతేడాది అక్టోబర్‌లో బాబర్ ఆజమ్ వారసుడిగా పాక్ సారథ్య బాధ్యతలు చేపట్టిన రిజ్వాన్‌ను ఇంత తక్కువ వ్యవధిలో తొలగించడం, అలాగే ఇటీవల టీ20 కెప్టెన్సీ కోల్పోయిన షాహీన్‌ అఫ్రిదికి తిరిగి వన్డే పగ్గాలు అప్పగించడం క్రీడా వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనందుకే..

అయితే మహమ్మద్ రిజ్వాన్ వేటు వెనుక షాకింగ్ రీజన్ ఉంది. బెట్టింగ్ కంపెనీలను ప్రమోట్ చేయనని చెప్పడంతోనే రిజ్వాన్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించారని తెలుస్తోంది. ప్రజల ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ కంపెనీలను ప్రమోట్ చేయనని, ఆ సంస్థలతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోనని తెలియజేస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు రిజ్వాన్ లేఖ రాసినట్లు పీసీబీ వర్గాలు మీడియాకు తెలిపాయి.

Mohammad Rizwan Sacked as ODI Captain Over Refusal to Endorse Betting Companies

అయితే ఇది పీసీబీ ఒప్పందాలకు విరుద్దమని, దాంతోనే అతనిపై చర్యలు తీసుకున్నారని సమాచారం. బెట్టింగ్ కంపెనీలతో పీసీబీ అనేక ఆర్థికలావాదేవీలు కొనసాగిస్తోంది. పీసీబీ మనుగడకు బెట్టింగ్ యాప్స్ ఒప్పందాలు కీలకమని పీసీబీకి చెందిన ఓ అధికారి మీడియాకు వెల్లడించారు.

సీపీఎల్‌లోనూ..

కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)‌లో సెయింట్ కిట్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన రిజ్వాన్.. బెట్టింగ్ కంపెనీ లోగోతో ఉన్న జెర్సీని వేసుకునేందుకు నిరాకరించాడు. స్పాన్సర్ లోగో లేని జెర్సీతో ఆడాడు. పాలస్తీనాకు మద్దతు తెలపడం కూడా అతని కెప్టెన్సీ వేటుకు కారణంగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ జట్టు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ వెల్లడించాడు.

'కేవలం పాలస్తీనా జెండా పట్టుకున్నందుకే కెప్టెన్సీ నుంచి తీసేస్తారా? ఈ నిర్ణయం వెనుక మైక్ హెస్సన్ ఉన్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో రిజ్వాన్ పాటిస్తున్న మతపరమైన సంస్కృతి అతనికి నచ్చలేదు. అందుకే ఈ మార్పు జరిగింది' అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

పాలస్తీనాకు మద్దతు ఇవ్వడంతోనే..

మహమ్మద్ రిజ్వాన్ పలుమార్లు పాలస్తీనాకు తన మద్దతును ప్రకటించాడు.వన్డే ప్రపంచకప్‌ 2023లో శ్రీలంకపై విజయం తర్వాత ఆ విజయాన్ని గాజా ప్రజలకు అంకితమిచ్చాడు. అంతేకాకుండా ఈ ఏడాది ఏప్రిల్‌లో పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో తన జట్టు తరఫున కొట్టే ప్రతీ సిక్సర్‌, తీసే ప్రతీ వికెట్‌కు పాలస్తీనా స్వచ్ఛంద సంస్థలకు రూ. లక్ష విరాళం ఇస్తానని ప్రకటించాడు. ఈ పరిణామాలన్నీ అతని కెప్టెన్సీ వేటుకు కారణమయ్యాయి.

Story first published: Tuesday, October 21, 2025, 17:57 [IST]
Other articles published on Oct 21, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+