Mohammad Rizwan: నీ జిడ్డు బ్యాటింగ్‌కో దండం.. వచ్చేయ్ రా సామీ! (వీడియో)
బిగ్‌బాష్ లీగ్‌లో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్‌కు ఘోర అవమానం ఎదురైంది. అతని జిడ్డు బ్యాటింగ్‌కు తట్టుకోలేకపోయిన టీమ్‌మేనేజ్‌మెంట్ రిటైర్డ్ ఔట్‌గా వెనక్కిరప్పించింది. దాంతో బిగ్ బాష్ లీగ్ చరిత్రలోనే రిటైర్డ్ ఔట్ అయిన తొలి ఓవర్‌సీస్ ప్లేయర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు.
మెల్‌బోర్న్ రెనిగెడ్స్, సిడ్నీ థండర్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ లీగ్‌లో మెల్‌బోర్న్ రెనిగెడ్స్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్న రిజ్వాన్.. 23 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 26 పరుగులే చేశాడు. వేగంగా ఆడేందుకు ఇబ్బంది పడుతుండటంతో రిటైర్డ్ ఔట్‌గా వెనక్కి వచ్చేయాలని టీమ్‌మేనేజ్‌మెంట్ సూచించింది. దాంతో రిజ్వాన్ నిరాశగా పెవిలియన్ చేరాడు.
ఈ టోర్నీలో రిజ్వాన్ దారుణంగా విఫలమయ్యాడు. 8 మ్యాచ్‌ల్లో 167 పరుగులే చేశాడు. అతని స్ట్రైక్ రేట్ కేవలం 100 ప్లస్ మాత్రమే కావడం గమనార్హం. రిజ్వాన్‌ను భారీ ధరకు మెల్‌బోర్న్ రెనిగెడ్స్ కొనుగోలు చేయగా.. అతను తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. రిటైర్డ్ ఔట్ అయిన ఈ మ్యాచ్‌లోనే అతను ఒక సిక్స్ కొట్టాడు. ఈ టోర్నీ మొత్తంలో అతను కొట్టిన సిక్స్ ఇదే కావడం గమనార్హం.

ప్రస్తుతం రిజ్వాన్ రిటైర్డ్ ఔట్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 'టీ20ల్లో టెస్ట్ బ్యాటింగ్ చేస్తే ఇలానే బయటకు రమ్మంటారు'అని కామెంట్ చేస్తున్నారు. రిజ్వాన్‌కు ఇంతకంటే అవమానం మరొకటి ఉండదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ఈ టోర్నీలో రాణించి పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కించుకోవాలని రిజ్వాన్ భావించాడు. కానీ అతని ప్రదర్శన దారుణంగా ఉండటంతో సెలెక్టర్లు అతన్ని పక్కనపెట్టే అవకాశాలు ఉన్నాయి. బాబర్ ఆజామ్ కూడా ఇదే తరహా ప్రదర్శనతో నిరాశపర్చాడు. సిడ్నీ సిక్సర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతను 8 మ్యాచ్‌ల్లో 154 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దాంతో ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లకు పాకిస్థాన్ సెలెక్టర్లు మొండిచెయ్యే చూపించనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications