పాకిస్థాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్.. సౌతాఫ్రికా వికెట్ కీపర్ హెన్రీచ్ క్లాసెన్‌తో గొడవపడ్డాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం కేప్ టౌన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహమ్మద్ రిజ్వాన్ సారథ్యంలో అసాధారణ ప్రదర్శన కనబర్చిన పాకిస్థాన్.. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను 81 పరుగుల తేడాతో ఓడించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది.
అయితే రిజ్వాన్, క్లాసెన్ గొడవే ఈ మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచింది. హ్యారీస్ రౌఫ్ వేసిన 26వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఆఖరి బంతిని హ్యారీస్ రౌఫ్ బౌన్సర్‌గా వేయగా.. క్లాసెన్ వదిలేసాడు. దాంతో ఈ బంతిని అందుకున్న రిజ్వాన్ తన నోటికి పనిచెప్పాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన క్లాసెన్.. రిజ్వాన్‌తో వాగ్వాదానికి దిగాడు. ఫీల్డ్ అంపైర్లతో పాటు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ జోక్యం చేసుకొని ఇద్దరి ఆటగాళ్లను వారించారు. దాంతో గొడవ సద్దుమణిగింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.5 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. మహమ్మద్ రిజ్వాన్(82 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80), బాబర్ ఆజామ్(95 బంతుల్లో 7 ఫోర్లతో 73), కమ్రాన్ గులామ్(32 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీలతో రాణించారు.
సౌతాఫ్రికా బౌలర్లలో క్వేనా మఫకా(4/72) నాలుగు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్(3/71) మూడు వికెట్లు పడగొట్టాడు. ఫర్చూన్, పెహ్లుక్వాయోకు చెరో వికెట్ దక్కింది. అనంతరం సౌతాఫ్రికా 43.1 ఓవర్లలో 248 పరుగులకు కుప్పకూలింది. హెన్రీచ్ క్లాసెన్(74 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 97) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. అతనికి తోడు మరే బ్యాటర్ రాణించలేదు.
పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది(4/47) నాలుగు వికెట్లు తీయగా.. నసీమ్ షా(3/37) మూడు వికెట్లు పడగొట్టాడు. అబ్రార్ అహ్మద్(2/48)కు రెండు వికెట్లు దక్కగా.. సల్మాన్ అఘాకు ఓ వికెట్ దక్కింది. తొలి వన్డేలోనూ పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే ఆదివారం జరగనుంది.
— HaSsan (@finee_leg) December 19, 2024