అతని గురించి రివ్యూ మీటింగ్‌లో గంభీర్‌ను కడిగేయాలి: మహ్మద్ కైఫ్
ఇంగ్లండ్ పర్యటనలో కుల్దీప్ యాదవ్‌ను ఆడించకపోవడంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను నిలదీయాలని బీసీసీఐని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కోరాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో భారత పేలవ ప్రదర్శన నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో బీసీసీఐ రివ్యూ మీటింగ్ నిర్వహించనుంది.
ముంబైలో బీసీసీఐ హెడ్ ఆఫీస్‌లో జరిగే ఈ సమీక్ష సమావేశంలో భారత జట్టు వరుస ఓటములకు గల కారణాలతో పాటు భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించనున్నారు. మూడు వన్డేల సిరీస్‌లో కుల్దీప్ యాదవ్‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం ఇవ్వలేదు. ఆఖరి వన్డేలో జస్‌ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్ గాయాలతో దూరమైనా.. కుల్దీప్ యాదవ్‌ను ఆడించలేదు. దాంతో ఇంగ్లండ్ 387 పరుగుల భారీ స్కోర్ చేసి విజయాన్నందుకుంది.

గంభీర్‌ను నిలదీయాలి..
అయితే కుల్దీప్ యాదవ్‌ను ఎందుకు ఆడించలేదో? టీమ్‌మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నించాలని బీసీసీఐకి మహ్మద్ కైఫ్ సూచించాడు. 'రివ్యూ మీటింగ్‌లో బీసీసీఐ తప్పకుండా తుది జట్టు ఎంపిక గురించి ప్రశ్నించాలి. కారణాలను తెలుసుకోవాలి. బుమ్రా, సుందర్, వరుణ్ లేని సమయంలో కూడా కుల్దీప్ యాదవ్‌ను ఆడించకపోవడం గురించి అడగాలి. జోస్ బట్లర్ చివర్లో చేసిన 40 పరుగులతో ఇంగ్లండ్ విజయం సాధించింది. బట్లర్‌పై కుల్దీప్‌కు మంచి రికార్డ్ ఉంది.
గతంలో ఇంగ్లండ్ గడ్డపై కుల్దీప్ యాదవ్ మెరుగ్గా బౌలింగ్ చేశాడు. అలాంటి కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టడం వెనకు ఉన్న కారణాలను తెలుసుకోవాలి. బ్యాటింగ్ డెప్త్ కోసం కుల్దీప్ యాదవ్‌ను ఆడించలేదని చెప్పవచ్చు. కానీ ఆ మ్యాచ్‌కు నెంబర్ 8లో ఆడే ఆల్‌రౌండర్ గాయంతో దూరమయ్యాడు. అయినప్పటికీ కుల్దీప్ యాదవ్‌ను ఆడించకపోవడం నా ఊహకు కూడా అందడం లేదు. అనుభవం లేని బౌలర్లను ఆడించారు.
టీమిండియాకు ఉన్న ప్రధాన సమస్య అదే
2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు ఉన్న అతిపెద్ద సమస్య బౌలింగ్. కోహ్లీ, రోహిత్ శర్మ గురంచి ఎలాంటి ఆందోళన లేదు. సౌతాఫ్రికా కండిషన్స్‌లో బౌలింగ్ చేయడం గురించే ఆందోళన నెలకొంది. అక్కడి పిచ్‌లు చాలా భిన్నంగా ఉంటాయి. బ్యాటర్లు ఈజీగా పరుగులు చేయలేరు. కొన్నిసార్లు 250 కంటే తక్కువ స్కోర్లు నమోదు కావచ్చు. అలాంటి లక్ష్యాలను కాపాడుకునే బౌలింగ్ మన దగ్గర ఉందా? ఇదే అతిపెద్ద ప్రశ్న.
ప్రపంచకప్ గెలవాలంటే.. సమతుల్యమైన జట్టు కావాలి. బ్యాటింగ్ బలంగా ఉండి, బౌలింగ్ బలహీనంగా ఉండకూడదు. 250 వంటి లక్ష్యాలను కాపాడుకునే బౌలింగ్ ప్రస్తుతం భారత జట్టు దగ్గర లేదు. బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు ప్రత్యామ్నాయ బౌలర్లు లేరు. షమీ, భువనేశ్వర్ కుమార్ వంటి నాణ్యమైన బౌలర్లు లేరు. కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నప్పుడు సిరాజ్‌ను ఎందుకు ఆడించడం లేదో నాకు అర్థం కావడం లేదు.'అని కైఫ్ అసహనం వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

