Road Safety World Series 2020: వారెవ్వా కైఫ్.. వాటే ఫీల్డింగ్.. ఈ వయసులో కూడా !!

ముంబై: అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై చాలా రోజులైనా.. వయసు నలబైకి చేరినా టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆటలో మాత్రం వన్నె తగ్గలేదు. టీమిండియా జాంటీ రోడ్స్‌గా పేరొందిన ఈ భారత సూపర్ ఫీల్డర్ 39 ఏళ్ల వయసులో కూడా అదరగొట్టాడు. అద్భుత డైవ్‌లు.. సూపర్ క్యాచ్‌లు.. బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌తో మైమరిపించాడు. ఒకప్పటి కైఫ్ ఎలా మైదానంలో చిరుతలా పరుగెత్తుతూ బంతులను ఆపేవాడో.. అలాంటి ఫీల్డర్‌నే మరోసారి చూపించాడు. వయసు పెరిగినా.. తనలో సత్తా తగ్గలేదని.. తన ఫీల్డింగ్ ఏమాత్రం మారలేదని చూపించాడు.

రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు నిధుల సేకరణ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వరల్డ్ రోడ్ సేఫ్టీ సిరీస్‌లో భాగంగా అలనాటి ఆటగాళ్లంతా మళ్లీ క్రికెట్ ఆడుతూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం శ్రీలంక లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని ఇండియా లెజెండ్స్ జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచింది.

హైలైట్ క్యాచ్‌లు..
అయితే ఈ మ్యాచ్‌లో కైఫ్ రెండు సూపర్ క్యాచ్‌లతో మెస్మరైజ్ చేశాడు. తన కెరీర్ ప్రారంభం(2000)లో ఎలా ఫీల్డింగ్ చేసేవాడో 2020లో కూడా అదే తరహా ఫీల్డింగ్‌తో అదరగొట్టాడు. డీప్ పాయింట్ దిశగా అతను పట్టిన క్యాచ్‌లు మ్యాచ్‌కే హైలైట్. అతని సూపర్ ఫీల్డింగ్‌కు ధాటిగా ఆడిన దిల్షాన్, చమర కపుగెడెరా నిరాశగా పెవిలియన్ చేరారు. దీంతో శ్రీలంక సాధారణ స్కోర్‌కే పరిమితమైంది. ప్రస్తుతం ఈ క్యాచ్‌లకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. 39 ఏళ్ల వయసులో కూడా కైఫ్ కుర్రాడిలా ఫీల్డింగ్ చేస్తుండగా.. అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

సూపర్ బ్యాటింగ్..
ఇక బ్యాటింగ్‌లోనూ కైఫ్ అద్బుత ప్రదర్శన కనర్చాడు. 139 పరుగుల స్వల్ప లక్ష్యంతోనే బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్ 19/3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన కైఫ్.. ఇర్ఫాన్ పఠాన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 45 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్‌తో 46 పరుగులు చేసి పఠాన్‌కు అండగా నిలిచాడు.

మెరిసిన మునాఫ్..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 పరుగులు చేసింది. ఆ జట్టు దిల్షాన్(23), కపుగెడెరా(23) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత పేసర్ మునాఫ్ పటేల్(4/19) శ్రీలంక పతనాన్ని శాసించగా.. జహీర్ ఖాన్, పఠాన్, మన్‌ప్రీత్, సంజయ్ బంగర్ తలో వికెట్ తీశారు.

పఠాన్ విధ్వంసం..
అనంతరం 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్.. మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ( 31 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్స్‌లతో 57 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 139 పరుగులు చేసి 8 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో చెలరేగిన సచిన్ టెండూల్కర్(0), వీరేంద్ర సెహ్వాగ్(3) విఫలమయ్యారు. యువరాజ్ సింగ్(1) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. అద్భుతంగా ఆడిన ఇర్ఫాన్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications