Mohammed Kaif కళ్లు చెదిరే క్యాచ్.. 42 ఏళ్ల వయసులోనూ ఫీల్డింగ్‌లో తగ్గేదేలే! (వీడియో)
Mohammed Kaif: టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. 42 ఏళ్ల వయసులోనూ ఫీల్డింగ్‌లో తగ్గేదేలే అనే రీతిలో సూపర్ డైవ్స్‌తో క్యాచ్‌లు అందుకున్నాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో మణిపాల్ టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మహమ్మద్ కైఫ్.. తన ఫీల్డింగ్ విన్యాసాలతో అభిమానులను అబ్బూరపరుస్తున్నాడు.
గత శుక్రవారం బిల్వారా కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మహమ్మద్ కైఫ్ రెండు అద్భుత క్యాచ్‌లు అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కగా.. నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మహమ్మద్ కైఫ్ ఫీల్డింగ్ కా బాప్ అంటూ కొనియాడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో కైఫ్ ప్రాతినిథ్యం వహిస్తున్న మణిపాల్ టైగర్స్ 89 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మణిపాల్ టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 211 పరుగులు చేసింది. చాద్విక్ వాల్టన్(55 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104) శతక్కొట్టగా.. రాబిన్ ఊతప్ప(30 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో రాణించాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన బిల్వార కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 122 పరుగులే చేసి ఓటమిపాలైంది. తాను ఆడే రోజుల్లో కైఫ్ సంచలన ఫీల్డింగ్‌తో అద్భుత క్యాచ్‌లు అందుకునేవాడు. భారత్ తరఫున 13 టెస్ట్‌లు ఆడిన కైఫ్ 624 పరుగులు చేశాడు. 125 వన్డేల్లో 2753 పరుగులు సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications