Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏమయ్యా రోహిత్ నీకు బుద్దుందా? సూర్య కుమార్ ఓపెనరా? మహమ్మద్ కైఫ్ ఫైర్!

Mohammad Kaif Slams Rahul Dravid And Rohit Sharma For Opening With Suryakumar Yadav

న్యూఢిల్లీ: వెస్టిండీస్ గడ్డపై టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వేదిక, ఫార్మాట్, కెప్టెన్ మారినా ఫలితం మాత్రం మారలేదు. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఐదు టీ20ల సిరీస్‌లో శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి టీ20లో సమష్టిగా చేలరేగిన రోహిత్ సేన 68 పరుగుల తేడాతో విండీస్‌ను ఓడించింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌గా సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. టీమిండియా మేనేజ్‌మెంట్ చేసిన ఈ ప్రయోగాన్ని మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. కేఎల్ రాహుల్ గాయంతో జట్టుకు దూరమవడంతో టీమిండియా ఇప్పటికే ఏడుగురు ఓపెనర్లను మార్చింది. ఇదే విషయంపై టీమిండియా ఇన్నింగ్స్ అనంతరం మాట్లాడిన మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ టీమ్‌మేనేజ్‌మెంట్ తీరును తప్పుబట్టాడు.

అర్థం పర్థం లేని ప్రయోగం

అర్థం పర్థం లేని ప్రయోగం

..

సూర్యకుమార్ యాదవ్‌ను ఓపెనర్‌గా ఆడించడానికి బుద్దుందా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ఈ ప్రయోగం అత్యంత చెత్తదంటూ కామెంట్ చేశాడు. గత రెండు మ్యాచ్‌ల్లో రిషభ్ పంత్ ఓపెనర్‌గా ఆడించినప్పుడు అతనికే మరో అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. రెండు సార్లు ఓపెనింగ్ చేసిన పంత్ 26, 1తో విఫలమయ్యాడు. అయితే అసాధారణ బ్యాటింగ్ చేయగల పంత్‌కు మరికొన్ని అవకాశాలు ఇవ్వాలని కైఫ్ సూచించాడు. సూర్యకుమార్ యాదవ్ మంచి మిడిలార్డర్ బ్యాట్‌రని, అతను నాలుగో స్థానంలో ఆడటం కరెక్ట్ అని చెప్పాడు. టీమ్ పరిస్థితులకు తగ్గట్లు అతను బ్యాటింగ్ చేసి చక్కదిద్దే బాధ్యత అతనిపై ఉందని చెప్పాడు.

పంత్‌ను ఆడించాల్సింది..

పంత్‌ను ఆడించాల్సింది..

'సూర్యకుమార్ యాదవ్ ఓపెనింగ్ పంపించడం నాకు ఏ మాత్రం అర్థం కాలేదు. రిషభ్ పంత్‌ను ఓపెనర్‌గా ఆడించాలని రెండు మ్యాచ్‌లను అవకాశం ఇచ్చిన టీమ్ మేనేజ్‌మెంట్ ఈ రోజు కూడా అతన్నే రోహిత్‌తో పంపించాల్సింది. కనీసం అతనికి ఐదు అవకాశాలు ఇవ్వాల్సింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్, సపోర్ట్ స్టాఫ్ 5-6 మ్యాచ్‌ల వరకు అండగా ఉండాల్సింది. కానీ పంత్‌ను పక్కనపెట్టి సూర్యను ఓపెనింగ్ పంపించారు.

మిడిలార్డర్‌లో ఇన్నింగ్స్‌ బాధ్యతను తీసుకోవడం, తనదైన షాట్లతో తుది మెరుగులు దిద్దడం సూర్యకుమార్ పని. కోహ్లీ, రాహుల్ జట్టులో ఉన్నప్పుడు అతను నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. అయితే ఓపెనింగ్ స్లాట్ కోసం పంత్‌ను పరీక్షించాల్సింది. ఏమైందో కానీ సూర్యను పంపించారు. మరోవైపు ఇషాన్ కిషన్ సైతం ఎదురుచూస్తున్నాడు.'అని కైఫ్ చెప్పుకొచ్చాడు.

డీకే మెరుపులు..

డీకే మెరుపులు..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(44 బంతుల్లో 64; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దినేశ్‌ కార్తీక్‌ (19 బంతుల్లో 41 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. అనంతరం భారత బౌలర్ల సమష్టి ప్రదర్శనకు విండీస్‌ విలవిల్లాడింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 122 పరుగులే చేసింది. బ్రూక్స్‌ (20) టాప్‌ స్కోరర్‌ కాగా... అర్‌‡్షదీప్, అశ్విన్, బిష్ణోయ్‌ తలా 2 వికెట్లు తీశారు.

Story first published: Saturday, July 30, 2022, 15:17 [IST]
Other articles published on Jul 30, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+