Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్‌నే తప్పించారు.. సూరీడు ఎంత?: మహమ్మద్ కైఫ్

టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను తప్పిస్తున్నారనే వార్తలపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ స్పందించాడు. సూర్య కెప్టెన్సీ కోల్పోతున్నాడనే వార్తలు తనను ఏమాత్రం ఆశ్చర్యపరచలేదన్నాడు. రోహిత్ శర్మనే తప్పించారని, సూర్యకుమార్ యాదవ్ ఎంత? అని చెప్పుకొచ్చాడు.

ఫామ్‌ను కారణంగా చూపిస్తూ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై వేటు వేయడం సరికాదని కైఫ్ అభిప్రాయపడ్డాడు. గత ఏడాదిన్నరగా పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని భారత సెలెక్షన్ కమిటీ నిర్ణయించిందని గత రెండు రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది.

Mohammad Kaif Slams BCCI and Selectors Over Suryakumar Yadav s Removal as T20I Captain
Photo Credit: X (twitter)

నేనేం షాక్ అవ్వలేదు..

అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని, తుది జట్టులో సూర్యకు చోటు కూడా కష్టమేనని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పందించిన కైఫ్.. రోహిత్ శర్మ కెప్టెన్సీ కోల్పోయినప్పుడే తాను షాకింగ్‌గా ఫీలయ్యానని, ఇప్పుడు ఇవన్నీ సహజంగానే కనిపిస్తున్నాయని చెప్పాడు.

'నాకు ఈ వార్తలు ఏ మాత్రం ఆశ్చర్యంగా అనిపించడం లేదు. నిజానికి రోహిత్ శర్మ కెప్టెన్సీ కోల్పోయినప్పుడే నేను షాకయ్యాను. ఆ తర్వాత ఇలాంటి నిర్ణయాలు సాధారణంగానే కనిపిస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ విషయంలో ఇది పెద్ద నిర్ణయమే. కానీ రోహిత్ తప్పిస్తూ తీసుకున్న నిర్ణయమే ఇంకా పెద్దది. ఇప్పుడు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నామనే సందేశాన్ని బీసీసీఐ ఇవ్వాలనుకుంటోందని నాకు అనిపిస్తుంది.

మాజీ క్రికెటర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. కారు ముక్కలైనా!

మాజీ క్రికెటర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. కారు ముక్కలైనా!

ఇది సరైన నిర్ణయం కాదు..

సూర్యకుమార్ యాదవ్ సారథిగా టీమిండియాకు టీ20 ప్రపంచ కప్ అందించాడు. జట్టులో కొనసాగేందుకు అతను పూర్తి అర్హుడు. ప్రస్తుతం పరుగులు చేయకపోవచ్చు. కానీ జట్టును విజయవంతంగా నడుపుతున్నాడు. జట్టు మెరుగైన విజయాలు సాధిస్తున్నప్పుడు అతని ఫామ్ మాత్రమే చూసి నిర్ణయం తీసుకోవడం సరికాదు.

సారథిగా సూర్య తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాడు. అందుకే అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. ఒకవేళ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తే ఆటగాడిగా జట్టులో చోటివ్వాలి.'అని మహమ్మద్ కైఫ్ చెప్పుకొచ్చాడు.

టీమిండియా టీ20 సారథ్య బాధ్యతల నుంచి సూర్యను తొలగించే విషయంపై అధికారిక ప్రకటన రానప్పటికీ..అతని భవిష్యత్తుపై జరుగుతున్న చర్చలు భారత క్రికెట్‌లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఆడు మగాడ్రా బుజ్జి.. 15 ఏళ్లకే రూ.10 కోట్లు ఎనకేసాడు!

ఆడు మగాడ్రా బుజ్జి.. 15 ఏళ్లకే రూ.10 కోట్లు ఎనకేసాడు!
Story first published: Friday, June 5, 2026, 18:13 [IST]
Other articles published on Jun 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+